E-Paper
Advertisement

కోటి రూపాయల ఛాలెంజ్.. ‘కిల్లర్’ సెకండాఫ్ ట్విస్ట్ చెప్పడం అంత ఈజీ కాదట!

కోటి రూపాయల ఛాలెంజ్.. ‘కిల్లర్’ సెకండాఫ్ ట్విస్ట్ చెప్పడం అంత ఈజీ కాదట!
Advertisement

Killer Movie:సైఫై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కిల్లర్’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని దర్శకుడు, నిర్మాత, నటుడు పూర్వాజ్ ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసిన తర్వాత ఇంత వైవిధ్యంగా కథ రాసి, తెరకెక్కించవచ్చా? అని ప్రేక్షకులు థ్రిల్ అవుతారని అన్నారు. జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించిన ఈ సినిమాను ఉర్వీశ్ పూర్వజ్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు సర్టిఫికెట్ లభించింది.

‘కిల్లర్’ ఒక సాధారణ థ్రిల్లర్ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో విభిన్నమైన కథాంశంతో రూపొందించిన చిత్రమని పూర్వాజ్ తెలిపారు. ఎలాన్ మస్క్ న్యూరోలింక్ ద్వారా మిషిన్లతో మనిషి మెదడును అనుసంధానించే అంశంపై పరిశోధనలు చేస్తున్నారని, అదే సాంకేతికతను మనిషిపై ప్రయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో తమ సినిమా కథను రూపొందించినట్లు వెల్లడించారు. అయితే ఈ కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా, వినోదాత్మకంగా తెరకెక్కించామని చెప్పారు. సినిమాలో రక్తపాతం, అతిగా హింసను చూపించకుండా వాంపైర్, స్పై, టెర్రరిస్ట్ వంటి పాత్రలను విభిన్నంగా ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.

Advertisement

ఈ చిత్రంలోని ప్రతి పాత్ర పేరు ‘ఆర్’ అక్షరంతోనే ప్రారంభమవుతుందని పూర్వాజ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. జ్యోతి పూర్వజ్ ఇందులో పలు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, యాక్షన్ సన్నివేశాలను సింగిల్ టేక్‌లోనే పూర్తి చేశారని ప్రశంసించారు. ఆమె ప్రతి పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ కావడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. సినిమా విజువల్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, షూటింగ్‌ను కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేసినట్లు వివరించారు. వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతోనే సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు.

సినిమా సెకండాఫ్‌లోని ట్విస్ట్‌ను ముందుగా చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించడం ఇప్పటికే చర్చనీయాంశమైంది. అక్టోబర్ 29 రాత్రి 10 గంటలకు ప్రీమియర్లు ప్రదర్శించి, రాత్రి 11 గంటలకు ట్విస్ట్‌ను గుర్తించిన వారు తమ సమాధానాన్ని వాట్సాప్ ద్వారా పంపించాలని పూర్వాజ్ తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు హైకోర్టు న్యాయవాదుల సమక్షంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ట్రైలర్ చూసినా కథను ఎవరూ పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారని, అసలు ట్విస్టుల కోసం సినిమా చూడాల్సిందేనని అన్నారు.

Advertisement

దర్శకత్వం, నిర్మాణం, నటన.. ఇలా మూడు బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం తనకు సినిమా మేకింగ్‌పై ఉన్న ఆసక్తి వల్లే సాధ్యమైందని పూర్వాజ్ చెప్పారు. గతంలో ‘మాస్టర్ పీస్’, ‘మాటరాని మౌనమిది’, ‘శుక్ర’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ‘కిల్లర్’తో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు తెప్పించే సన్నివేశాలు కూడా ఉంటాయని, కథలోని అసలు పాయింట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

ALSO READ :గాజులు గలగల పాటతో ఫేమస్..రాధమ్మ కూతురు వర్సెస్ కళ్యాణమ్మ

Tags

Related News

దివ్య భారతి దగ్గర బిత్తిరి సత్తి అల్లరి.. సుధీర్ నవ్వులు ఆపుకోలేదుగా!

హోమ్లీగా కనిపిస్తూనే గ్లామర్‌తోనూ మెప్పించనుందా.. పవర్ పేటలో రితికా!

ప్రణవి మానుకొండ అందాల విందు.. ఈ ఫోటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

‘జైలర్ 2’ కంటే ముందే రజినీ, హృతిక్ కలిసి నటించిన మూవీ ఏమిటో తెలుసా?

నితిన్ అలియాస్ రుక్మిణి నుంచి రుక్కు రుక్కు రుక్మిణి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

ఆర్. నారాయణమూర్తి మనసు మార్చిన హుషారు 2..ఎందుకు ఒప్పుకున్నారో ?

‘హుషారు 2’ టీజర్.. ఇలా ఉందేంటి భయ్యా? ఆ పాత్రలో ఆర్ నారాయణమూర్తి!

Big Stories

Advertisement
×