Pranavi Manukonda Photos:ప్రణవి మానుకొండ..అడపాదడపా సినిమాలలో కనిపిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. అలా నెట్టింట్లో ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండే ఈ బ్యూటీ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని కొత్త ఫోటోలతో మరోసారి వైరల్ అవుతోంది. “Just leaving these here” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ అంటూ పెట్టిన ఈ ఫోటోలుఇప్పుడు యూత్ ని మెస్మరైజ్ చేస్తుంది. కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ ఫోటోల్లో ప్రణవి లుక్ చాలా న్యాచురల్ గానే కాకుండా స్టైలిష్‌గా ఉండటం విశేషం. ఇక ఆమె వేసుకున్న వైట్ కలర్ అవుట్‌ఫిట్‌కు తోడు రెడ్ కలర్ లేస్ డీటెయిలింగ్ ఆ డ్రస్‌కే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పక్కర్లేదు. ఇక లూజ్‌గా వదిలేసిన హెయిర్ ముఖంపై తక్కువ మేకప్ ఆమె అందాన్ని డబల్ చేశాయనే చెప్పాలి.
తన పర్సనల్ లైఫ్ స్టైల్, బ్యూటిఫుల్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఎప్పుడూ ఫాన్స్ తో టచ్‌లోనే ఉండే ఈ బ్యూటీ అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోషూట్లతో అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది కూడా.ఇక కెరీర్ విషయానికి వస్తే సోషల్ మీడియా రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణవి, ఇప్పుడు సినిమాల్లో కూడా సత్తా చాటుతుంది. ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ సినిమాలో మౌనిక పాత్రతో ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ అమ్మడు ఆ తర్వాత రేజర్, అమిగోస్, బాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చే క్రెడిట్‌ను, ఫాలోయింగ్‌ను సినిమాల్లో అవకాశాలుగా మల్చుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయంలో ప్రణవి చాలా పర్ఫెక్ట్ అని మరోసారి ఈ ఫోటోలు ప్రూవ్ చేస్తున్నాయి.ఒకవైపు నటనపై దృష్టి పెడుతూనే, మరోవైపు ఇలాంటి ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
అయితే తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఏవైనా సినిమా ప్రమోషన్ల కోసం తీసినవా లేక కేవలం తన పర్సనల్ కలెక్షనా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ అభిమానులకు మాత్రం ఇవి ఐ ఫీస్ట్ గా మారిపోయాయి.ఇక ఫోటోలు చూసిన ఫాన్స్ చాలా సింపుల్‌గా ఉన్నా ఈ లుక్ చాలా ట్రెండ్‌గా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ప్రణవి మానుకొండ తన నటనతో పాటు సోషల్ మీడియా గ్లామర్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటోంది.ఇక ముందు ముందు మె మరిన్ని మంచి ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి అభిమానుల ఆశల్ని నేరవేర్చేలా ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమాలతో అలరించబోతుందో !
ALSO READ :గాజులు గలగల పాటతో ఫేమస్..రాధమ్మ కూతురు వర్సెస్ కళ్యాణమ్మ