E-Paper
Advertisement

‘జైలర్ 2’ కంటే ముందే రజినీ, హృతిక్ కలిసి నటించిన మూవీ ఏమిటో తెలుసా?

‘జైలర్ 2’ కంటే ముందే రజినీ, హృతిక్ కలిసి నటించిన మూవీ ఏమిటో తెలుసా?
Advertisement

Rajinikanth -Hrithik Roshan: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రజనీకాంత్ తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 (Nelson Dilip Kumar)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రసారం అవుతుంది . ఇకపోతే ఈ సినిమాలో వివిధ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా కీలకపాత్రలలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించి సందడి చేశారు.

12 ఏళ్ల వయసులోనే రజినీకాంత్ తో హృతిక్..

ఇలా హృతిక్ రోషన్ ఈ సినిమాలో భాగం కావడంతో రజినీకాంత్ హృతిక్ రోషన్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలర్ 2 సినిమా కంటే ముందుగానే రజినీకాంత్ హృతిక్ రోషన్ ఇద్దరు కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారని చెప్పాలి. హృతిక్ రోషన్ 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే రజినీకాంత్ నటించిన భగవాన్ దాదా(Bhagawan Dada) సినిమాలో నటించి సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. 1986 లో విడుదలైన భగవాన్ దాదా సినిమాలో హృతిక్ గోవిందు అనే పాత్రలో కనిపించి సందడి చేశారు.

60 ఏళ్ల తర్వాత రజినీతో హృతిక్..

Advertisement

ఇక ఈ సినిమాకు హృతిక్ రోషన్ తాత ఓం ప్రకాష్ దర్శకత్వం వహించగా హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇలా 12 సంవత్సరాల వయసులోని రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న హృతిక్ రోషన్ దాదాపు 40 సంవత్సరాల తర్వాత తిరిగి జైలర్ 2 సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ రాడీ అనే పాత్రలో కనిపించారు. హృతిక్ రోషన్ క్యామియో ఉన్నది కేవలం ఐదు నిమిషాలు అయినప్పటికీ ఈయన పాత్ర మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రాడీ పాత్రలో సందడి చేసిన హృతిక్..

ఈ విధంగా రజినీ కాంత్ హృతిక్ రోషన్ 40 సంవత్సరాల కిందట స్క్రీన్ షేర్ చేసుకున్నారనే విషయం తెలిసిన అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక హృతిక్ రోషన్ కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక రజనీకాంత్ జైలర్ 2 సినిమా విషయానికి వస్తే జైలర్ సినిమాకు సీక్వెల్ సిద్ధంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ సినిమా కూడా రాబట్టని కలెక్షన్లను రజినీకాంత్ జైలర్ 2 ద్వారా కొల్లగొడుతున్నారు . ఈ సినిమాలో మోహన్ లాల్, హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, ఎస్ జె సూర్య, యోగి బాబు వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు.

Advertisement

Also Read: నితిన్ అలియాస్ రుక్మిణి నుంచి రుక్కు రుక్కు రుక్మిణి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Related News

నితిన్ అలియాస్ రుక్మిణి నుంచి రుక్కు రుక్కు రుక్మిణి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

ఆర్. నారాయణమూర్తి మనసు మార్చిన హుషారు 2..ఎందుకు ఒప్పుకున్నారో ?

‘హుషారు 2’ టీజర్.. ఇలా ఉందేంటి భయ్యా? ఆ పాత్రలో ఆర్ నారాయణమూర్తి!

హిట్ పాటలు.. భారీ క్రేజ్.. రామ్ మిరియాల ఒక్కో పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

కావ్య అనిరుద్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా? కాస్ట్ ఎంతో తెలిస్తే మతి పోవాల్సిందే!

సీతారామం ఫస్ట్ ఛాయిస్ మృణాల్ కాదా..ఇన్నాళ్ళు బయట పెట్టిన సీత!

చిరంజీవి టాక్ షో ‘మెగా వర్స్’ షూటింగ్ నేడే ప్రారంభం.. ఫస్ట్ గెస్ట్ లు వీళ్ళే!

Big Stories

Advertisement
×