E-Paper
Advertisement

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller: చుట్టూ మనుషుల జాడే కనిపించని ఎడారి. సహాయం కోసం పిలిచినా ఎవ్వరూ స్పందించే పరిస్థితి లేదు. అలాంటి చోట ఓ చిన్న విమానం కూలిపోతే… దాన్ని చూసి సహాయం చేయడానికి వెళ్లిన యువతినే పైలట్ తుపాకీతో బెదిరించి తన వెంట తీసుకెళ్తే ? పైగా ఆ విమానంలో ఉన్నది సాధారణ సరుకు కాదు… డ్రగ్స్ అని తెలిస్తే ? అప్పటికే ఆ డ్రగ్స్ కోసం ఓ క్రూరమైన క్రిమినల్ ముఠా వాళ్ల వెంటపడుతుంటే పరిస్థితి ఎలా మారుతుంది ? ఇలాంటి ఉత్కంఠభరితమైన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్‌నే ‘బొర్రెగో’ (Borrego). మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులో ఎక్కడ అందుబాటులో ఉందంటే ?

కథలోకి వెళ్తే…

కాలిఫోర్నియాలోని ఓ మారుమూల ఎడారి ప్రాంతానికి ఎల్లి అనే యువ వృక్షశాస్త్రజ్ఞురాలు వస్తుంది. ఓ ప్రత్యేకమైన మొక్కల జాతిపై పరిశోధన చేయడానికి ఆమె అక్కడ ఒంటరిగా గడుపుతుంటుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన విషాదం నుంచి బయటపడేందుకు కూడా ఈ ఏకాంతాన్ని ఎంచుకుంటుంది. ఓ సాయంత్రం ఎడారిలో ఉన్న సమయంలో ఆమె కళ్ల ముందే ఓ చిన్న అల్ట్రాలైట్ విమానం కూలిపోతుంది. అందులో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలని ఎల్లి దగ్గరకు వెళ్తుంది. కానీ అక్కడ ఆమెకు ఎదురయ్యేది ఊహించని ప్రమాదం. విమానం నడిపిన టోమస్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి.

Advertisement

ప్రమాదం తర్వాత తన పని పూర్తిచేయాల్సిన ఆతురతలో ఉన్న అతను… ఎల్లిని తుపాకీతో బెదిరించి తనకు దారి చూపించాలని బలవంతం చేస్తాడు. ఎడారిలో సరైన నీరు, ఆహారం, రక్షణ లేకుండా టోమస్‌ తో కలిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఎల్లికి ఎదురవుతుంది. మొదట అతన్ని ప్రమాదకరమైన వ్యక్తిగానే చూసిన ఆమెకు, క్రమంగా అతని పరిస్థితి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. టోమస్ వెనుక ఉన్న పరిస్థితులు, అతన్ని డ్రగ్స్ దందాలోకి నెట్టిన కారణాలు బయట పడుతుండటంతో వారి మధ్య సంబంధం కూడా మారుతూ ఉంటుంది. కానీ అసలు ముప్పు ముందు ఉంటుంది. విమానంలో ఉన్న ఫెంటానిల్ గమ్యస్థానానికి చేరకపోవడంతో గిల్లెర్మో అనే క్రూరమైన డ్రగ్ కార్టెల్ వ్యక్తి రంగంలోకి దిగుతాడు. డ్రగ్స్‌తో పాటు తనకు సంబంధించిన ఆధారాలు కూడా మాయం చేయాలని చూస్తున్న అతను ఎల్లి, టోమస్‌ల కోసం ఎడారిని జల్లెడ పడతాడు.

ఇదిలా ఉండగా ఎల్లి కనిపించకుండా పోవడంతో డిప్యూటీ షెరీఫ్ జోస్ గోమెజ్, అతని కుమార్తె అలెక్స్ ఆమె కోసం వెతకడం మొదలు పెడతారు. ఒకవైపు కార్టెల్ వేట… మరోవైపు మండుతున్న ఎడారి… ఇంకోవైపు నమ్మలేని వ్యక్తితో కలిసి ప్రయాణం. ఈ పరిస్థితుల నుంచి ఎల్లి ఎలా బయట పడుతుంది ? టోమస్ నిజంగా ఆమెకు అండగా నిలుస్తాడా ? గిల్లెర్మో వాళ్లను చేరుకునేలోపే పోలీసులు ఎల్లిని కనుగొంటారా ? అసలు ఆ ఎడారిలో మొదలైన ఈ డ్రగ్స్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుంది ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ ?

Advertisement

‘బొర్రెగో’ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది. యూట్యూబ్‌లోకూడా తెలుగు వెర్షన్ లభిస్తుంది. లూసీ హేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా యాక్షన్ హంగామాలా కాకుండా… ఎడారి వాతావరణం, సర్వైవల్ టెన్షన్, క్రైమ్ థ్రిల్‌… వంటి అంశాలతో సింపుల్‌గా సాగుతూ చివరి వరకు ఆసక్తికరంగా ఉటుంది. సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు ఒకసారి ట్రై చేయొచ్చు.

Read Also: తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

Tags

Related News

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

పదేళ్ల తర్వాత మళ్లీ కలిసే పాత ప్రేమికులు.. కట్ చేస్తే ఊహించని స్కాండల్‌లో భర్త అడ్డంగా బుక్

Big Stories

Advertisement
×