E-Paper
Advertisement

నటుడు అనంత్ నాగ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!

నటుడు అనంత్ నాగ్ కు  ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!
Advertisement

Anant Nag: భారతీయ సినిమా రంగంలో కొనసాగుతున్న నటీనటుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎంతో గౌరవమైన పురస్కారాలను ప్రకటిస్తూ ఉంటారు. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాలలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా ఒకటని చెప్పాలి. తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డుకు ప్రముఖ నటుడు అనంత్ నాగ్ (Ananth Nag) ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా నటుడు అనంత్ నాగ్ కు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి.

అనంత్ నాగ్ ను వరించిన దాదాసాహెబ్ ఫాల్కే..

అనంత్ నాగ్ కు 2024వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వరించిందని చెప్పాలి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆయన అందించిన కృషికి, అద్భుతమైన సినీ ప్రస్థానానికి గాను ఆ పురస్కారాన్ని అందించనుంది. దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు కమిటీ సూచన మేరకు కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈనెల 22న గుజరాత్‌లోని కేవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు.

300 సినిమాలకు పైగా నటించిన అనంత్ నాగ్…

Advertisement

అనంత్ నాగ్ కన్నడ నటుడు అయినప్పటికీ ఈయన మాత్రం హిందీ, తెలుగు, మరాఠీ ,మలయాళ ,ఇంగ్లీష్ భాషలలో సుమారు 300కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. థియేటర్ నటుడిగా ఆనంత్ నాగ్ తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక ఈయన 1973 వ సంవత్సరంలో “సంకల్ప” అనే కన్నడ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఆ తర్వాత నిశాంత్, భూమిక, మంథన్, కలియుగ్ వంటి ఎన్నో క్లాసిక్ హిందీ చిత్రాల్లో తన సహజ నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. శంకర్ నాగ్ దర్శకత్వంలో వచ్చిన ఆర్కే నారాయణ్ మాల్గుడి డేస్ టీవీ సిరీస్‌లో అనంత్ నాగ్ పోషించిన పాత్రలు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి.

రాజకీయాలలో మంత్రిగా బాధ్యతలు..

అనంత్ నాగ్ కేజీఎఫ్, గాలిపట, సర్కారి హిరియ ప్రాథమిక శాలె వంటి పాన్ ఇండియా సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా సినిమా రంగంలో వివిధ భాషలలో నటించి చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేస్తున్న ఈయన రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టారు.కర్ణాటక శాసన మండలి సభ్యుడిగా, జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఇలాంటి ఒక బహు ప్రజ్ఞాశాలి అయినటువంటి నటుడికి అత్యున్నత పురస్కారం లభించడంతో దేశ ప్రధాని సైతం ఈ విషయం పై స్పందిస్తూ.. అనంత్ నాగ్ కు ఇలాంటి గొప్ప పురస్కారం ఎంతో సంతోషకరం అంటూ ఆయనకు అభినందనలు తెలుపుతూ నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక నటుడు అనంత్ నాగ్ కు ఇలాంటి పురస్కారం లభించినందుకు సోషల్ మీడియా వేదికగా నటీనటులు ఆయన అభిమానులు కూడా అభినందనలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.

Advertisement

Also Read: సెన్సార్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. రన్ టైం ఎంతంటే?

Related News

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?

జాన్వీ కపూర్ లుక్ అదిరిందిగా.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

సెన్సార్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. రన్ టైం ఎంతంటే?

ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?

వేల కోట్ల స్కామ్.. ఇప్పుడు పూట గడవడం లేదు.. ఆర్థిక కష్టాల్లో ఐబొమ్మ రవి!

లండన్ లో జంటగా త్రిష విజయ్..త్రిష స్థానంలో నేనుంటే ఆ పని చేయను.. నటి ఫైర్!

Big Stories

Advertisement
×