Rahul Ramakrishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ గా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ఒకరు. కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈయన అనంతరం తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో రాహుల్ రామకృష్ణ వరుస వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈయన సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతున్నాయి.
గత కొంతకాలంగా ఈయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాల పరంగా కూడా చర్చలకు కారణం అవుతున్నాయి. అయితే ఇటీవల తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలిచిన ఈయన సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను తట్టుకోలేక తాను చేసిన పోస్టులు అన్నింటిని డిలీట్ చేశారు. అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఈయన తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదే విషయాన్ని రామకృష్ణ తెలియజేస్తూ.. పాలనపై విమర్శల కంటే వ్యవస్థలో భాగస్వామ్యమై పనిచేయడం తన కర్తవ్యం అని తెలియజేశారు. రాజకీయ వర్గాల ప్రముఖులతో చర్చలు జరిపిన తరువాతనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలకు సేవ చేసే సమయం వచ్చేవరకు తాను కేవలం సినిమాలలో నటిస్తూ తెరపై తన అత్యుత్తమ పనిని ప్రేక్షకులకు అందించడం పై మాత్రమే దృష్టి పెడతానని ప్రకటిస్తూ జై తెలంగాణ.. జై హింద్ అంటూ తన నిర్ణయాన్ని తెలియపరిచారు. ఈ విధంగా రామకృష్ణ పోస్ట్ చేయడంతో ఇకపై ఈయన సినిమాలలో మాత్రమే నటిస్తారని అలాగే ప్రజా సేవ చేయడానికి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ప్రజాసేవకు సిద్ధమైన రాహుల్ రామకృష్ణ…
మరి రాహుల్ రామకృష్ణ ప్రజాసేవ చేయడం కోసం రాజకీయ పార్టీలలోకి అడుగుపెట్టబోతున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల ఈయన పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ బిఆర్ఎస్ నాయకులను ట్యాగ్ చేస్తూ కొన్ని పోస్టులు చేశారు.. ఈ పోస్టులు కనుక గమనిస్తే ఒకవేళ రాహుల్ రామకృష్ణ రాజకీయాలలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని మరికొంతమంది భావిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ కెరియర్ విషయానికి వస్తే ఈయన కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా, రచయితగా విలేకరిగా కూడా పనిచేశారు. సైన్మా అనే షార్ట్ ఫిలిం తో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు, హుషారు, గీత గోవిందం వంటి సినిమాలతో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
Also Read: Hrithik Roshan: వార్ 2 సినిమాపై ఓపెన్ అయిన హృతిక్.. గాయంలా ఉండాల్సిన పనిలేదంటూ!