Kalki 2: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Aswin)ఇటీవల ప్రభాస్(Prabhas) తో కల్కి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సుమతి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. కల్కి సినిమాలో సుమతి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే(Deepika Padukone) నటించిన సందడి చేశారు.
ఇకపోతే కల్కి సీక్వెల్ సినిమాలో దీపికా పదుకొనే సుమతీ పాత్రలో నటించడం లేదంటూ ఇటీవల కల్కి మేకర్స్ అధికారికంగా వెల్లడించడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఇక ఈ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడంతో మరి సుమతి పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ పాత్రలో ఫలానా హీరోయిన్ నటించబోతోంది అంటూ ఎంతోమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా సాయి పల్లవి(Sai Pallavi) పేరు కూడా వినపడుతోంది. నాగ్ అశ్విన్ నటి సాయి పల్లవితో ఓ సినిమా కోసం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ఇలా సాయి పల్లవిని సంప్రదించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడటంతో ఖచ్చితంగా కల్కి 2 (Kalki 2) సినిమా గురించే అని అందరూ భావిస్తున్నారు. అయితే ఈయన బాలీవుడ్ నటి అలియా భట్(Alia Bhatt) తో కూడా ఒక సినిమా చేయాలని భావించారట అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి ఆలియా భట్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారంటూ కూడా మరొక వార్త వినపడుతుంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ మొత్తానికి నాగ్ అశ్విన్ సాయి పల్లవిని అప్రోచ్ కావడంతో కల్కి 2 పైనే మంచి బజ్ ఏర్పడుతుంది.
బాలీవుడ్ సినిమాలతో బిజీగా సాయి పల్లవి
కల్కి సీక్వెల్ సినిమాలో సుమతి పాత్రకు కీలక ప్రాధాన్యత ఉండబోతుందని మొదటి భాగం చూస్తేనే అర్థమవుతుంది. ఈ తరుణంలో ఈ పాత్రలో సాయి పల్లవిని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు ఇండస్ట్రీ సమాచారం. మరి నాగ్ అశ్విన్ సాయి పల్లవి ఎంపిక ఏ సినిమాకు అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. అయితే ఇదివరకు కల్కి సీక్వెల్ సినిమాలో అనుష్క నటించబోతుందంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు. ఇక సాయి పల్లవి కూడా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ రామాయణ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. మొదటి భాగం 2026 దీపావళి పండుగకు విడుదల కారునట్లు వెల్లడించారు.
Also Read: Rahul Ramakrishna: ట్రోల్స్ ఎఫెక్ట్… ప్రజా సేవలోకి దిగిన రాహుల్ రామకృష్ణ