Anaganaga Oka Raju : కొన్ని సినిమాలు మీద విపరీతమైన నమ్మకాలు ఉంటాయి. కేవలం టీజర్ తోనే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పటివరకు నవీన్ పోలిశెట్టి హీరోగా మూడు సినిమాలు చేశాడు. మూడు సినిమాల కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. ఆడియన్స్ కొనుక్కున్న టికెట్ కు పర్ఫెక్ట్ న్యాయం చేసిన సినిమాలు నవీన్ పోలిశెట్టి చేశాడు.
నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కేవలం ఈ టీజర్ సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ పెంచింది. ఆ తర్వాత ఈ సినిమా గురించి పెద్దగా న్యూస్ బయటకు రాలేదు. ముందుగా శ్రీ లీల హీరోయిన్, నవీన్ పోలిశెట్టి హీరో అని అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కూడా రాజుగాడు పెళ్లి అని ఒక వీడియోను విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై ఎంత అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రోమో ను ఓ జి సినిమాతో పాటు అటాచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ నిర్మిస్తున్నారు.
ఓజి సినిమాకు ఏ రేంజ్ రీచ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓజి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనగనగా ఒక రాజు సినిమా గురించి తెలుస్తుంది. అలానే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన చిన్న సినిమాలు భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా కంటెంట్ తో పాటు కామెడీ ఎంటర్టైనర్ గా సక్సెస్ అయింది. అంతేకాకుండా దానిలో ఒక మంచి పాయింట్ దర్శకుడు రైజ్ చేశాడు. అలానే జాతి రత్నాలు సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. నవీన్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది సినిమా. ఈ సినిమాలో కూడా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని దర్శకుడు చూపించాడు.
అనగనగా ఒక రాజు విషయానికి వస్తే, ఈ సినిమాలో రాజు గాడి పెళ్లి గురించి చూపించబోతున్నట్లు ఇప్పటికే రెండు వీడియోలు తో తెలుస్తుంది. దీనిని మించి పని తో పాటు కొత్త పాయింట్ ఏమైనా చెబుతారేమో వేచి చూడాలి. ఏదేమైనా ఈ సినిమా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చింది అంటే బ్రహ్మరథం పట్టడం ఖాయం. నవీన్ పోలిశెట్టి ఖాతాలో హైయెస్ట్ కలెక్షన్స్ కూడా చూస్తాం.
Also Read: OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!