OG Censor : సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైనప్పుడు సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను సుజిత్ చూపించిన విధానం చాలా మందికి గూజ్ బమ్స్ తెప్పించింది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. మూడు పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా ఈ సినిమా పైన పవన్ కళ్యాణ్ అభిమానులు మంచి క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. స్వతహాగా సుజీత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడం, అలానే ఇది స్ట్రైట్ సినిమా కావడంతో మంచి అంచనాల ఏర్పడ్డాయి.
ఓజి సినిమాకి సంబంధించి సెన్సార్ నేడు పూర్తి అయిపోయింది. ఈ సినిమాకు క్లీన్ U/A సర్టిఫికెట్ వచ్చింది. అంటే అన్ని రకాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసే అవకాశం ఉంది. దీనిని బట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసే అవకాశం దొరుకుతుంది. ఫ్యామిలీస్ ఈ సినిమాకు వస్తే మంచి కలెక్షన్స్ వస్తాయి. అలానే ఈ సినిమా నుంచి విడుదలైన లవ్ సాంగ్ కూడా ఫ్యామిలీ స్టోరీ కి స్కోప్ ఉంది అనిపించేలా ఉంది. మొత్తానికి సుజిత్ అరాచకం సృష్టిస్తున్నాడు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో ఇంత బ్లడ్ చూపించి, బీభత్సమైన వైలెన్స్ చూపించిన కూడా ఈ సినిమాకి క్లీన్ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read : TG Viswa Prasad: విశ్వప్రసాద్ సరికొత్త రూటు… ఇక ఇండస్ట్రీకి మంచి రోజులే