Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సుమ తర్వాత శ్రీముఖి (Sreemukhi)పేరే వినపడుతుంది. ప్రస్తుతం శ్రీముఖి వరుస బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. స్టార్ మాలో వరుస కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈమె త్వరలోనే వినాయక చవితి రాబోతున్న నేపథ్యంలో గణపతి బప్పా మోరియా అంటూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే సీరియల్ నటీనటులు పాల్గొని సందడి చేశారని తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ద్వారా స్పష్టం అవుతుంది.
అమ్మ తర్వాత శ్రీముఖికేనా?
ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా గుండె నిండా గుడిగంటలు (Gundeninda Gudigantalu) సీరియల్ నటుడు విష్ణు కాంత్(Vishnu Kanth) అలియాస్ బాలు(Balu) శ్రీముఖి(Sreemukhi) కోసం ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ఇవ్వడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. స్టార్ మా పరివార కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి బాలుతో లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు చూపిస్తారు. అయితే బాలు మాత్రం శ్రీముఖి కోసం ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ని తీసుకురావడంతో నిజంగానే బాలు శ్రీముఖి ప్రేమలో ఉన్నారా? అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీముఖి కోసం బాలు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే…
స్వయంగా చీర నేసిన బాలు…
విష్ణుకాంత్ కుటుంబ సభ్యులు చీరలు నేస్తారని పలు సందర్భాలలో వెల్లడించారు. ఈ క్రమంలోనే శ్రీముఖి కోసం స్వయంగా తన చేతులతో మగ్గం ద్వారా అందమైన పట్టు చీరను నేసి శ్రీముఖికి కానుకగా ఇచ్చారు. ఇలా శ్రీముఖి కోసం తన చేతులతో చీర నేసారనే విషయం తెలియజేయడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే తాను మొదటిసారి మా అమ్మ కోసం చీర నా చేతులతో నేసానని, మా అమ్మ తర్వాత నీకోసమే చీరను తయారు చేశాను అంటూ శ్రీముఖికి ఈ కానుకను అందించడంతో శ్రీముఖి కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇలా బాలు స్వయంగా చీరను(Saree) నేసి ఇవ్వడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
?igsh=MXh3MmhqYzAyYWR1cA%3D%3D
ఇలా శ్రీముఖి కోసం ప్రత్యేకమైన బహుమతి ఇవ్వటంతో కొంపదీసి బాలు శ్రీముఖి విషయాన్ని సీరియస్ గా తీసుకొని తనకు చీరను గిఫ్టుగా ఇచ్చారా అంటూ అందరూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక శ్రీముఖి ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివార్ కార్యక్రమంతో పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో కూడా శ్రీముఖి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా నిత్యం వరుస కార్యక్రమాలతో యాంకర్ గా బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్నారు. అయితే కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించినప్పటికీ శ్రీముఖికి పెద్దగా పేరు ప్రఖ్యాతలు రాలేదని చెప్పాలి. బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న ఈమె బిగ్ బాస్ 3 అవకాశం అందుకొని రన్నర్ గా బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై వరుస కార్యక్రమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Balakrishna: అరుదైన గౌరవం అందుకున్న బాలయ్య.. ఇండస్ట్రీలోని ఏకైక నటుడిగా గుర్తింపు!