Big Tv Kissik talks:ఢీ షో (Dhee show) ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. అలా ఢీ డ్యాన్స్ షో చాలామందికి బెస్ట్ ప్లాట్ఫారం గా మారింది. ఈ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫర్ లుగా మారారు. అయితే అలాంటి ఢీ షో ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన డాన్సర్లలో పండు మాస్టర్ కూడా ఒకరు.. గత ఎనిమిది సీజన్ల నుండి ఢీ షోలో కొనసాగుతున్న ఈయన తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ షోలో పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు. ఇందులో భాగంగా తన ప్రాణ స్నేహితులతో ఉన్న గొడవ గురించి కూడా చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఎంతో ప్రాణంగా ఉండే స్నేహితుడితో పండుకి ఎందుకు గొడవలు వచ్చాయి ? వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కిస్సిక్ టాక్స్ షోలో సందడి చేసిన పండు..
డాన్సర్ అయినటువంటి పాండు మాస్టర్ కేవలం ఢీ షోలోనే కాదు తన కామెడీతో కూడా జబర్దస్త్ లో అవకాశం అందుకున్నారు. అలా బుల్లితెర కామెడీ షో అయినటువంటి జబర్దస్త్ లో ఇమ్మానుయెల్, వర్షా , పండు మాస్టర్లు కలిసి చేసే స్కిట్లకు ఎంతో మంది జనాలు కడుపుబ్బా నవ్వుకునేవారు. అలా ఓవైపు కామెడీ మరోవైపు డాన్సులు చేస్తూ బుల్లితెరపై పేరు సంపాదించిన పండు మాస్టర్ తాజాగా వర్ష హోస్ట్ గా చేస్తున్న కిస్సిక్ టాక్స్ షోకి వచ్చారు. ఇందులో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా పంచుకున్నారు పండు. అలా ఈ షోలో తన ప్రాణ స్నేహితులతో ఉన్న గొడవల గురించి పండు చెప్పుకొచ్చారు..
ప్రాణ స్నేహితుడితో విభేదాలు..
వర్ష మాట్లాడుతూ.. మీకు ఇప్పటివరకు ఎవరైనా స్నేహితుల దగ్గర వెన్నుపోటు ఎదురైందా? కత్తిపోటు కంటే స్నేహితుడి పోటు చాలా డేంజర్ అంటారు కదా.. అలాంటి సిచువేషన్ మీకు ఎదురయిందా? అని అడిగితే.. నాకు అలాంటి సిచువేషన్ ఎప్పుడు ఎదురవలేదు కానీ నా ప్రాణ స్నేహితుడితో మాత్రం విభేదాలు నన్ను ఇబ్బందులు పెట్టాయి అని చెప్పాడు. ఆయన ఎవరో పేరు చెప్పగలరా అని వర్షా అడగగా పేరు.. చెప్పడానికి ఏముంది నా చేతి మీద పచ్చబొట్టు ఉంది కదా అని చూపిస్తూ తన చేతి మీద ఉన్న హరి అనే పచ్చబొట్టిన చూపించాడు. అలాగే తన ఫ్రెండ్ హరి చిన్నప్పుడే తన పేరుని పచ్చబొట్టుగా వేయించుకున్నాడని వాడు ఎప్పుడో వేయించుకుంటే నేను ఐదు సంవత్సరాల క్రితం ఈ పచ్చబొట్టు వేయించుకున్నారని చెప్పుకొచ్చారు.
మిస్ అండర్ స్టాండింగ్ వల్లే గొడవలు..
అయితే అంత క్లోజ్ గా ఉన్న వీరి మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వల్ల కొన్ని గొడవలు అయ్యాయట. ఈ గొడవల వల్ల పండు చాలా సఫర్ అయిపోయారట. కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే ఇద్దరి మధ్య కొన్ని రోజులు మాటలు లేకపోయినప్పటికీ.. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయామని కానీ ముందు ఉన్నంత ప్రాణ స్నేహం అయితే మా మధ్య లేదు అని, అప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ కి ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కి చాలా తేడా ఉంది అని , అందుకే నా జీవితంలో ఎవరితోనూ ఎక్కువగా ఫ్రెండ్షిప్ మైంటైన్ చేయడం లేదని చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు పండు మాస్టర్.. ప్రస్తుతం పండు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది స్నేహితుల మధ్య ఇలాంటి మిస్ అండర్స్టాండింగ్ వల్ల చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయి చివరికి చాలా దూరం దారి తీస్తాయి. కానీ ఫ్రెండ్షిప్ లో ఇలాంటి మిస్ అండర్ స్టాండింగ్స్ ఉన్నా కూడా వాటిని పట్టించుకోకూడదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ALSO READ:Film industry: షూటింగ్ సెట్ లో విషాదం..అసిస్టెంట్ డైరెక్టర్ కన్నుమూత!