E-Paper
Advertisement

30ఏళ్లు ఎదురుచూసి వెన్నుపోటు పొడిచారు.. కట్టుకున్న భార్యపై తొలిసారి స్పందించిన విజయ్!

30ఏళ్లు ఎదురుచూసి వెన్నుపోటు పొడిచారు.. కట్టుకున్న భార్యపై తొలిసారి స్పందించిన విజయ్!
Advertisement

Vijay Thalapathy:సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ , కృష్ణ వంటి దిగ్గజ నటుల కాలం నుంచి చిరంజీవి , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల వరకు ఎంతో మంది రాజకీయాలలో సత్తా చాటారు.. చాటుతున్నారు కూడా.. ఈ క్రమంలోనే అటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోలుగా పేరు దక్కించుకున్న ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా చలామణి అయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో పాటు యంగ్ హీరోలైన విజయ్ దళపతి వంటి వారు కూడా రాజకీయ రంగంపై ఆసక్తి కనపరుస్తున్నారు.. అందులో భాగంగానే సినిమాల ద్వారా తమకు స్టార్ డంను అందించిన ప్రజలకు నేరుగా సహాయం చేయాలి అనే లక్ష్యంతో సొంతంగా కొత్త పార్టీలను ఏర్పాటు చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి టీవీకే అనే ఒక కొత్త పార్టీని స్థాపించి మరికొన్ని రోజుల్లో తమిళనాడులో జరగబోయే ఎన్నికలలో పోటీ చేసి తమిళనాడుకి ముఖ్యమంత్రిగా అవతరించాలని ప్రయత్నం చేస్తున్నారు

30 ఏళ్లుగా నమ్మిన వారే మోసం చేశారు – విజయ్

ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ప్రజలలోకి వెళ్తూ బహిరంగ సభలు ఏర్పాటు చేసి మరీ ప్రసంగిస్తున్నారు విజయ్ . ఈ క్రమంలోనే తాజాగా ఆయన తూతుకుడి, తిరునెల్ వెళ్లి ప్రాంతాలలో బహిరంగ సభల్లో తన సతీమణి సంగీత గురించి పరోక్షంగా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. విజయ్ దళపతి మాట్లాడుతూ..” సుమారుగా 30 సంవత్సరాల నుండి నా చుట్టూ ఉన్నవాళ్లు సరిగ్గా ఎన్నికల సమయంలోనే నాకు వెన్నుపోటు పొడవడానికి ముందుకు వచ్చారు.అలా ఎందుకు చేస్తున్నారో మీ అందరికీ కూడా బాగా తెలుసు. ముఖ్యంగా మీరు ఎంత మందిని అడ్డం పెట్టుకొని నా మీద రాజకీయాలు చేయాలని చూసినా.. నా అభిమానుల నుండి నన్ను ఎవరూ దూరం చేయలేరు” అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు విజయ్ దళపతి. ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విడాకులపై తొలిసారి స్పందించిన విజయ్..

Advertisement

ఇకపోతే విజయ్ బహిరంగంగా మాట్లాడినా.. ఇన్ డైరెక్ట్ గా మాట్లాడినా.. తొలిసారి తన విడాకుల గురించి స్పందించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ప్లాన్ ప్రకారమే విజయ్ పై నెగిటివిటీ పెంచుతున్న నేపథ్యంలోనే అటు విజయ్ కూడా తన తెలివితేటలను ప్రదర్శించి ఈ నెగెటివిటీని దూరం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది.

రూమర్స్ కి చెక్ పెట్టిన త్రిష..

ఇక దీనికి తోడు అటు ఇంస్టాగ్రామ్ లో త్రిష పెట్టిన ఒక స్టోరీ పోస్ట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజులు ఆమెను విజయ్ తో రిలేషన్ లో ఉంది అని, అటు సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు బహిరంగంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలసి కనిపించడంతోనే ఆ రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. కానీ త్రిష మాత్రం..” నాకు ఒక వ్యాపారవేత్తతో పెళ్లయిందని, ఇప్పటికే రెండేళ్ల వయసున్న నలుగురు పిల్లలు ఉన్నారంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక ఆపండి.. ఇలాంటి ట్రోల్స్ ఈరోజుతో ఆపేస్తే బాగుంటుంది” అంటూ ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.

Advertisement

ALSO READ:కాజల్ తో రొమాన్స్ చేసే అవకాశం మిస్ చేసుకున్న అడివి శేష్!

ఓట్ల కోసం తిప్పలు అంటూ మండిపడుతున్న నెటిజన్స్..

అయితే నెటిజన్స్ మాత్రం ఓట్ల కోసమే వీళ్ళు చేస్తున్న జిమ్మిక్స్ ఇవి అంటూ మండిపడుతున్నారు. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలి అంటే రాబోయే రోజుల్లో వెలువడే ఫలితాల రూపంలో తేలనుంది అని చెప్పవచ్చు. ఇకపోతే తమిళనాడులో 23వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×