Yashasvi Jaiswal: ఇంగ్లాండ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లోని మాంచెస్టర్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుండి 4వ టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగి నిలకడగా ఆడింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
Also Read: Arjun Tendulkar: టీమిండియా నుంచి మరో మిచెల్ స్టార్క్ వచ్చేస్తున్నాడు
టీమిండియా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 61, యశస్వి జైష్వాల్ 58, రిషబ్ పంత్ 37 { రిటైర్డ్ హార్ట్}, పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజ్ లో రవీంద్ర జడేజా 19, శార్దూల్ ఠాకూర్ 19 ఉన్నారు. అయితే టీమిండియా ఓపెనర్లు మరోసారి మెరుగైన ఆరంభాన్ని అందించారు. లంచ్ సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 78 పరుగులు చేసింది భారత జట్టు. కానీ రెండవ సెషన్ లో పరిస్థితి మారింది. తద్వారా మూడు వికెట్లను కోల్పోయి.. గాయం కారణంగా రిషబ్ పంత్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు.
ఊహించని సంఘటన:
ఈ నాలుగోవ టెస్టు మ్యాచ్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాట్.. ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ సంధించిన డేంజరస్ బంతికి బద్దలవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ లో క్రిస్ వోక్స్ బౌలింగ్ చేస్తుండగా.. యశస్వి జైస్వాల్ బ్యాక్ ఫుట్ డిఫెన్సివ్ షాట్ ఆడియో ప్రయత్నం చేశాడు. అయితే వోక్స్ వేసిన బంతి అదనపు బౌన్స్ తో వచ్చి బ్యాట్ కి బలంగా తాకింది. దీంతో బ్యాట్ హ్యాండిల్ పూర్తిగా విరిగిపోయి.. బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ ఘటనతో యశస్వి జైస్వాల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత డగౌట్ నుంచి కొత్త బ్యాట్ తెప్పించుకోవలసి వచ్చింది. ఈ సంఘటన మైదానంలో ఉన్నవారినే కాకుండా.. టీవీల్లో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులను కూడా విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలో యశస్వి జైష్వాల్ బ్యాట్ విరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యశస్వి జైస్వాల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్:
జైస్వాల్ తన అద్భుతమైన ఫామ్, టాలెంట్ తో ఈ మ్యాచ్ లో మరోసారి ఆకట్టుకున్నాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గత 50 సంవత్సరాలలో ఓల్డ్ ట్రాఫోర్డులో హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ బ్యాట్స్మెన్ గా యశస్వి జైష్వాల్ నిలిచాడు. 58 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి అద్భుతమైన బ్యాటింగ్ ను ప్రదర్శించాడు. 107 బంతులు ఎదుర్కొన్న యశస్వి 10 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో తన ఇన్నింగ్స్ ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.
Also Read: Chahal – Mahvash: లండన్ లో అడ్డంగా దొరికిపోయిన టీమిండియా ప్లేయర్.. భార్యను కాదని ప్రియురాలితో !
భారత జట్టు ఓపెనింగ్ లో గతంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు ఈ మైదానంలో పరుగులు చేసినా.. గత ఐదు దశాబ్దాలుగా ఏ భారత ఓపెనర్ కూడా ఇక్కడ హాఫ్ సెంచరీ మార్క్ ని దాటలేదు. అంతేకాకుండా ఈ మైదానంలో టీమిండియా రికార్డు కూడా అంత ఆశాజనకంగా లేదు. 1936లో తొలిసారి ఈ మైదానంలో అడుగుపెట్టిన భారత జట్టు.. ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ క్రమంలో యశస్వి జైష్వాల్ సాధించిన ఈ హాఫ్ సెంచరీ ఒక సాధారణ స్కోర్ కాదని.. ఇది ఓ చారిత్రాత్మక ఘటన అని క్రీడా పండితులు కొనియాడుతున్నారు.
?utm_source=ig_web_copy_link