Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళకముందు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ దెబ్బతింది అనేది ఒప్పుకోలేని వాస్తవం.
మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంది అంటే ఒక నెలరోజుల ముందు నుంచే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి కేవలం వారం రోజులు ఉన్నా కూడా పెద్దగా వైబ్ లేకుండా పోయింది. మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్
ఒకప్పుడు సినిమాలకు సంబంధించి ఆడియో రిలీజ్ ఈవెంట్లు జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో సోమవారం జరుగుతుంది. ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వస్తారు అని వార్తలు వచ్చాయి. అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రాజమౌళి వస్తారా లేదా అనేది డౌట్. అలానే గత అనుభవాల దృష్ట్యా లిమిటెడ్ గెస్ట్స్ తో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. వెన్యూ శిల్పకళావేదిక వేదిక అని సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన నేడు ఇవ్వనున్నారు.
అంచనాలు పెంచింది
పవన్ కళ్యాణ్ కు తెలుగులో ఏ స్థాయి మార్కెట్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. డిజాస్టర్ సినిమాతో కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టగలిగే కెపాసిటీ కళ్యాణ్ కి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా చేస్తే చూడాలి అని చాలామంది అనుకున్నారు ఆ తరుణంలో హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా సినిమా క్రిష్ దర్శకత్వంలో వస్తుంది అన్నప్పుడు అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా గూజ్బమ్స్ తెప్పించేలా ఉంటుంది.
ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఒక తరుణంలో ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు కూడా వచ్చాయి. దర్శకుడు క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం కూడా కొద్దిపాటి మైనస్ అయింది. మొత్తానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ సినిమా జులై 24న ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఈ సినిమా పైన నిర్మాతలు మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా ఫలితం ఏంటో ఆ రోజు తెలుస్తుంది.
Also Read: Anupama Parameswaran : లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు, అనుపమ ఎమోషనల్ వర్డ్స్