CM Revanth Reddy: ట్యాపింగ్ కేసును వేగవంతం చేశామని.. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల విషయంలో తాను హడావుడి చేయనని చెప్పారు. కేసుల విచారణను కేంద్రమే ఆపుతోందని.. కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ఏమీ చేయలేదని అన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పోరాటం నా చివరి అస్త్రం: సీఎం రేవంత్
‘మేం అధికారంలోకి వచ్చాక అరెస్టులు చేస్తున్నాం. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు. ఫార్ములా ఈ రేస్, గొర్రెలు, హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ కేసులో ఈడీ ఎందుకు అరెస్టులు చేయడ లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘ఈడీకి సంబంధించిన మంత్రితో కిషన్ రెడ్డి.. ఎందుకు కేసులను ఫాలో అప్ చేయడం లేదు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తున్నాయి. నాకు వ్యక్తులు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పోరాటం నా చివరి అస్త్రం. టీఆర్ఎస్ పదేళ్లలో సాధించలేని అంశాలను నేను సాధించాను. 2018లో రిజర్వేషన్లను 23 శాతానికి కుదించింది కేసీఆరే. 50 శాతం మించేది లేదంటూ బీసీ రిజర్వేషన్ పైన కేసీఆర్ చట్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: KCR Big Shock to Armoor Jeevan Reddy: గెటౌట్ ఫ్రం మై ఫామ్‌హౌస్.. జీవన్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్
కేసీఆర్ సలహాలు ఇస్తే వద్దాన్నామా..?
‘తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో అమలవుతున్న రిజర్వేషన్లను తీసివేసిన తర్వాత.. తెలంగాణలో తీసేయమని అడగాలి. సెప్టెంబర్ 30 లోగా సంస్థలు ఎన్నికలు పూర్తి చేస్తాం. బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ముసురు వీరులు ఉన్నారు. పరిపాలన అంటే హైదరాబాదులో ఫామ్ హౌస్ లో కూర్చోవడం కాదు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ సలహాలు ఇస్తే మేం వద్దాన్నామా..?’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ALSO READ: Warangal Congress Party Issue: వరంగల్ జిల్లాలో పదవుల భర్తీకి నో..
చట్టం పరిధిలోనే విచారణ జరుగుతోంది..
గంజాయ్ బ్యాచ్ కు నేను భయపడను.. సిస్టంకు మాత్రమే నేను భయపడతాను. నేను భయపడితే రేవంత్ రెడ్డి కాను. చట్టం పరిధిలోనే విచారణ జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల అవినీతిపై కమిషన్ లో విచారణ కొనసాగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని హైకోర్టు పరిశీలిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కేసీఆర్ ను.. బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అవయదానంతోనే.. బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. తుమ్మిడిహట్టి అంశంపై మహారాష్ట్ర సీఎంని కలుస్తా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.