Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ టైమ్స్ లో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా ఒకప్పుడు ఈమెకు ఉన్న పాపులారిటీ వేరు. మలయాళం లో సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ లో నటించింది అనుపమ. ఈ సినిమా మలయాళం లో రిలీజ్ అయినా కూడా చాలామంది తెలుగు ప్రేక్షకులు వెతుక్కుని మరి చూశారు. చాలామంది తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఇప్పటికీ ఫేవరెట్ ఫిలిం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ నటించిన అ ఆ సినిమాలో నటించింది అనుపమ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అలానే అనుపమాకి కూడా మంచి పేరు వచ్చింది. ఒక తెలుగులో శతమానం భవతి వంటి సినిమాలు అనుపమను ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గర చేశాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో అనుపమ హిట్ సినిమా చేసి చాలా రోజులైంది.
లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే వెనక్కి వెళ్లిపోతారు
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో అనుపమ నటించిన సినిమా పరదా. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావలసి ఉంది. ఈ సినిమా పూర్తయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు. చిత్ర యూనిట్ కూడా ఒక్క రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత, అదే రిలీజ్ డేట్ కు మరో సినిమా రావడం అలా అలా పోస్ట్ పోన్ అవుతూ ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
ఈవెంట్లో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ఒక సినిమా పోస్టర్ మీద ఆడపిల్ల బొమ్మ ఉంది అంటే చాలామంది వెనక్కు తగ్గుతారు. ప్రొడ్యూసర్స్ కానీ, ఓటిటి వాళ్లు కానీ అంత త్వరగా ముందుకు రారు. ఎంత మంచి సినిమా అయినా కూడా అది అంతే. అది నేను తప్పు అని చెప్పట్లేదు కానీ అది రియాల్టీ. ఆ రియాలిటీ చెక్, మరియు ఇంత అండర్స్టాండింగ్ రావడానికి నా లైఫ్ లో వచ్చిన సినిమా పరదా.
ఇది బిగ్ బడ్జెట్ కాకపోవచ్చు
ఈ సినిమా బిగ్ బడ్జెట్ సినిమా కాకపోవచ్చు. కానీ ఈ సినిమా ద్వారా మేము చెబుతున్న మేటర్ చాలా చాలా పెద్ద మేటర్. ఇది కమర్షియల్ ఫైట్ ఉన్న, కమర్షియల్ సాంగ్ ఉన్న సినిమాలా ఉండదు. కానీ ఖచ్చితంగా దీనిలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. అది నేను మాటల్లో చెప్పిన మీకు అర్థం కాదు. మీరు సినిమా చూస్తే మీకు కూడా ఖచ్చితంగా ఇదే అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అయితే మాత్రం మంచి అంచనాలనే పెంచింది. సినిమా బండి సినిమాతో మంచి పేరు సాధించుకున్న ప్రవీణ్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి కొంతమందికి మంచి క్యూరియాసిటీ ఉంది.
Also Read: Rajamouli: మరీ అంత మాట అనేసావ్ ఏంటి జక్కన్న, అది ఫేవరెట్ సినిమా అయితే మిగతా సినిమాలేంటి.?