Harihara Veeramallu 2: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal ) హీరోయిన్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu). జూలై 23వ తేదీన రాత్రి పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలు పడగా.. ఇప్పుడు మొదటి షో ప్రారంభం అయింది. ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. అటు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా చూడడానికి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాల పాటు సెట్ పై నలిగిన ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని.. జూలై 24న అంటే ఈరోజు విడుదలైంది.
అసలైన కథ ‘యుద్ధ భూమి’లోనే చూడాలి..
ఇదిలా ఉండగా సినిమా విజయం సాధించడంతో హరిహర వీరమల్లు పార్ట్ 2 పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఈ సినిమా టైటిల్ నేమ్ కూడా రివీల్ చేశారు చిత్ర బృందం. హరిహర వీరమల్లు సినిమాలో కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఢిల్లీ బయలుదేరగా, వీరమల్లును అడ్డుకోవడానికి ఔరంగజేబు (బాబీ డియోల్ ) సిద్ధమవుతారు . వీరిద్దరూ కలుసుకోవడంతోనే సినిమాను ముగించారు. ఇక చివరిలో ‘యుద్ధ భూమి’ అనే నేమ్ కార్డుతో “అసలైన యుద్ధం అప్పుడే చూడాలి” అంటూ పార్ట్ 2 పై అంచనాలు పెంచేశారు. హైందవ ధర్మ పరిరక్షణ, కోహినూర్ ను దక్కించుకునే సమయంలో ఔరంగజేబుతో వీరమల్లు పోరాట సన్నివేశాలు హరిహర వీరమల్లు పార్ట్ 2 యుద్ధభూమిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే టైటిల్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న యూనిట్.. ఇక అసలైన పార్ట్ 2 తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా హరిహర వీరమల్లు..
16వ శతాబ్దపు నవాబు కాలంనాటి పీరియాడికల్ యాక్షన్ డ్రామగా హరిహర వీరమల్లు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పాత్రలో నటించారు. ఇక్కడ వజ్రాలతో పాటు ఇతర దొంగతనాలు చేసి అలా వచ్చిన డబ్బును పేద ప్రజలకు పంచి పెడుతూ ఉంటారు. అయితే ఒకసారి చిన్నదొర గోల్కొండ నవాబులకు ఇవ్వాల్సిన వజ్రాలను ముందుగా తనకే ఇవ్వాలని ఒక డీల్ కుదుర్చుకుంటాడు. అక్కడే పంచమి (నిధి అగర్వాల్) పరిచయమవుతుంది. అక్కడినుండి తనను తప్పించమని వీరమల్లును కోరుతుంది. అయితే అదే సమయంలో అనుకోకుండా గోల్కొండ నవాబులకు వీరమల్లు దొరికిపోతాడు. ఇక అక్కడి నుండి బయటపడాలి అంటే.. ఢిల్లీలో ఉన్న ఔరంగజేబు దగ్గర ఉన్న నెమలి సింహాసనంలోని కోహినూరు వజ్రాన్ని.. తనకు తెచ్చివ్వాలి అని గోల్కొండ నవాబు కండిషన్ పెడతాడు. ఇక అలా కోహినూరు వజ్రాన్ని తీసుకురావడానికి ఢిల్లీకి బయలుదేరిన వీరమల్లు.. ఔరంగజేబుతో ఎలా పోరాడారు? అనే విషయం తెలియాలి అంటే ఇక సీక్వెల్ లో చూడాల్సిందే అంటూ ముగించేశారు. మొత్తానికైతే అంచనాలు పెంచిన చిత్ర బృందం సెకండ్ భాగంతో ఎలాంటి కంక్లూజన్ ఇస్తుందో చూడాలి.