Rajeev kanakala: ప్రముఖ సినీ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రాజీవ్ కనకాల (Rajeev kanakala). ఇకపోతే అడపాదడపా సినిమాలు చేస్తుండడంతో నేటితరం యువతలో యాంకర్ సుమ (Suma kanakala) భర్తగానే మరింత పాపులారిటీ అందుకున్నారు. తన పని తాను చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండే రాజీవ్ కనకాలకు ప్రస్తుతం పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.
నటుడు రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు..
అసలు విషయంలోకి వెళ్తే.. రాజీవ్ కనకాలకు పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 421 లోని వెంచర్లో ఒక ఫ్లాట్ ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఫ్లాట్ లిటికేషన్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఫ్లాటును రాజీవ్ కనకాల చాలా పగడ్బందీగా ప్లాన్ వేసి మరీ టాలీవుడ్ సినీ నిర్మాత విజయ్ చౌదరి (Vijay Choudhary)కి విక్రయించారట. ఆ ఫ్లాట్ అమ్మిన వ్యవహారంలోనే ఇప్పుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది.
రూ.70 లక్షల భారీ మోసం..
అయితే ఆ భూమి లిటికేషన్లో ఉందని తెలిసి కూడా సినీ నిర్మాతకు చాలా తెలివిగా రాజీవ్ కనకాల అమ్మేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ చౌదరి రాజీవ్ దగ్గర కొనుగోలు చేసిన ఫ్లాట్ ను మరొక వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించాడు. సదరు వ్యక్తి తీరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూడగా అసలు వ్యవహారం బయటపడింది. రాజీవ్ కనకాల చాలా తెలివిగా లిటికేషన్ ఉన్న ప్లాట్ ను విజయ్ చౌదరికి విక్రయించేసారట. అయితే విజయ్ చౌదరి దగ్గర కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రం తన పేరు మార్చుకోవాలని ప్రయత్నం చేయగా.. అక్కడ అసలు ఫ్లాట్ లేదనే విషయం బయటపడింది. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన సదరు వ్యక్తి.. మోసపోయానని తెలుసుకొని విజయ్ చౌదరిపై హయత్ నగర్ లో కేసు నమోదు చేశారు.
అసలు నిజం బయటపెట్టిన విజయ్ చౌదరి..
అయితే విజయ్ చౌదరిని పోలీసులు ఆరా తీయగా.. రాజీవ్ కనకాల వద్ద ఆ ఫ్లాట్ కొనుగోలు చేశామని.. రాజీవ్ కనకాల తమను మోసం చేశాడని, లేని ప్లాటును ఉన్నట్లు చూపించి, మోసం చేశారని విజయ్ చౌదరి రాచకొండ కమిషనరేట్ పోలీసులకు తెలియజేశారు. దీంతో ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ పోలీసులు రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి దీనిపై రాజీవ్ కనకాల ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అటు అభిమానులతో పాటు ఇటు సినీ లవర్స్ అలాగే సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Harihara Veeramallu 2: హరిహర వీరమల్లు పార్ట్ 2 టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ గ్యారెంటీ!