Harihara veeramalu:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దాదాపు రెండేళ్ల తర్వాత నటించిన చిత్రం హరిహర వీరమల్లు(Harihara veeramalu). ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం (AM Ratnam) శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) పవన్ కళ్యాణ్ కి జోడిగా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) ఔరంగజేబు పాత్రలో నటించారు. సునీల్, నాజర్, సుబ్బరాజు, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై 24వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. శనివారంతోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుందని మేకర్స్ ఆశా భావం వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా వీకెండ్ లోపు ఖచ్చితంగా వంద కోట్ల క్లబ్లో చేరుతుందని విశ్లేషకులు అంచనా వేయడం గమనార్హం.
ఢిల్లీ ఏపీ భవన్లో హరిహర వీరమల్లు ప్రత్యేక ప్రదర్శన..
ఇదిలా ఉండదా ఇప్పుడు ఈ సినిమా ఢిల్లీని తాకింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఢిల్లీలోని ఏపీ భవన్ లో హరిహర వీరమల్లు చిత్రాన్ని రెండు రోజులపాటు ప్రదర్శించబోతున్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, వివిధ రంగాలలో విధులు నిర్వర్తిస్తున్న తెలుగువారు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల తోపాటు అక్కడి తెలుగువారి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని రెండు రోజులపాటు ప్రదర్శించనున్నారు. వారాంతపు సెలవు దినాలైన శని, ఆదివారాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్లు ఏపీ ప్రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
మొదటి షోకి ఊహించని రెస్పాన్స్..
అందులో భాగంగానే శనివారం రాత్రి 7 గంటలకు మొదటి షో వేయగా ఆడిటోరియం ప్రేక్షకులతో నిండిపోయింది. 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4:00 గంటలకు మరో షో వేయనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి అయితే ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారి కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించడం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. ఇప్పటివరకు ఏ హీరో కూడా తెలుగు వారి కోసం ఇలా ప్రత్యేకంగా తమ సినిమాను ప్రదర్శించిన దాఖలాలు లేవు. కానీ పవన్ కళ్యాణ్ తెలుగు వారిని దృష్టిలో పెట్టుకొని తన సినిమాను వారికోసం ప్రదర్శించడంతో అక్కడి తెలుగు ప్రజలు ఏపీ డిప్యూటీ సీఎంపై ప్రశంసల కురిపిస్తున్నారు..
పవన్ కళ్యాణ్ సినిమాలు..
ఇప్పటికే సుజీత్ (Sujith) దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 25 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొకవైపు హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా దాదాపు పూర్తయింది. ఇక కొంత భాగం మాత్రమే పెండింగ్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే.. పూర్తి చేయిస్తామని డైరెక్టర్ కూడా తెలియజేశారు. ఇందులో శ్రీ లీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే యేడాది జనవరి లోపు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాతే హరిహర వీరమల్లు 2 (యుద్ధ భూమి) తెరపైకి రానుందని సమాచారం.