Kissik Talks Shobha Shetty : తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ ఎన్నో రకాల కొత్త ప్రోగ్రాం లను ప్రేక్షకులకు అందిస్తుంది. ప్రతి ప్రోగ్రాం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ మధ్య వచ్చిన ఓ షో కిస్సిక్ టాక్స్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జబర్దస్త్ ద్వారా ఫేమ్ వర్ష ఈ షోకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ప్రతివారం పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి బుల్లితెర విలన్, హీరోయిన్ శోభా శెట్టి గెస్ట్ గా వచ్చింది. తన కెరీర్ లో ఎదుర్కొన్న పరిస్థితులు ప్రేమించిన వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.. ఆమె ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..
యశ్వంత్ తో పరిచయం.. పెళ్లి..?
సినిమాలలో కానీ సీరియల్స్లలో గాని కలిసి నటిస్తున్న వాళ్ళ మధ్య ఇష్టం ఏర్పడడం సహజం.. అయితే కొంతమంది తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తారు. మరి కొంతమంది మాత్రం మధ్యలోనే ఆ ప్రేమకు పుల్ స్టాప్ చెప్పేస్తారు.. శోభ శెట్టి ప్రేమ కూడా అలానే మొదలైందని ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తాజాగా ఈమె బిగ్ టీవీ కిసిక్ టాక్స్ లో పాల్గొన్నది.. ఇందులో ఆమె గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. అందులో భాగంగా తన ప్రేమ గురించి బయట పెట్టింది.. సీరియల్ లో ఉన్నప్పుడే యశ్వంత్ తో పరిచయం అయిందని చెప్పింది. తానే ముందుగా వెళ్లి ప్రపోజ్ చేయడంతో అతను కాస్త బెట్టు చేసినట్లు కూడా శోభ బయటపెట్టింది. ఇంక విడిదో కుదరదులే అని లైట్ తీసుకునే టైం లో అతనే వచ్చి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశాడు. అలా మా ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడింది అని శోభా అన్నారు. నిజానికి ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ వాళ్ళ మదర్ కి హెల్త్ బాగో లేకపోవడంతో పోస్ట్ పోన్ చేసుకున్నట్లు శోభ తెలిపారు. ఈ ఏడాదిలో వీళ్ళ పెళ్లి జరిగిపోతుందని మాత్రం ఏం ఇంటర్వ్యూలో బయట పెట్టేశారు..
Also Read:మీనా పై రోహిణి రివేంజ్.. పూలకోట్టును లేపేందుకు ప్లాన్.. ప్రభావతికి ప్లాన్..
శోభా శెట్టి పర్సనల్ విషయానికొస్తే..
కన్నడ బ్యూటి అయిన శోభా శెట్టికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈమె తెలుగులో కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు స్టైలిష్ గా రెడీ అవుతూ ఫోటోలను షేర్ చేస్తుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఎన్నో వీడియోలను చేస్తూ క్రేజ్ ను పెంచుకుంటుంది. తెలుగు సీరియల్స్ లో అవకాశాలు రాలేదని గతంలో ఓ సారి అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మేము తెలుగు సీరియల్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.