HBD Nara Rohit ..సాధారణంగా చాలామంది సినీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే అడుగు పెడతారు. అయితే అలా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ అందుకుంటున్నారా అంటే చెప్పలేని పరిస్థితి. కొంతమంది తమ మొదటి సినిమాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకొని.. ఆ తర్వాత తమ టాలెంట్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అదృష్టం లేక ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసి సక్సెస్ పొందలేక అభిమానులను నిరాశ పరుస్తున్నారు. అలాంటి జాబితాలోకి నారా వారి వారసుడు నారా రోహిత్ (Nara Rohit) కూడా వచ్చి చేరిపోయారని చెప్పవచ్చు.
‘ప్రతినిధి’ సినిమాతో..
చూడడానికి మంచి కటౌట్… వెనుక కొండంత బ్యాక్ గ్రౌండ్.. కానీ నారా రోహిత్ కి మాత్రం అదృష్టం వరించడం లేదు అని చెప్పవచ్చు. నిజానికి సినీ ఇండస్ట్రీలోకి నటుడిగా నిర్మాతగా అడుగుపెట్టి పేరు దక్కించుకునే ప్రయత్నం చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో నారా రోహిత్ సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. 2009లో ‘బాణం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. ఆ తర్వాత 2011లో ‘సోలో’ సినిమాలో నటించి పర్వాలేదనిపించుకున్నారు. ఈ సినిమా తర్వాత అవకాశాలు కూడా వరుసగా వచ్చాయి. ‘సారొచ్చారు’ , ‘ఒక్కడినే’ వంటి చిత్రాలు చేశారు. కానీ ఈ సినిమాలు విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాతో మళ్లీ నిలబడే ప్రయత్నం చేశారు.
హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు..
ఇక తర్వాత ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘తుంటరి’, ‘సావిత్రి’, ‘రాజా చెయ్యివేస్తే’ , ‘జో అచ్యుతానంద’, ‘శంకర’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘శమంతకమణి’, ‘కథలో రాజకుమారి’, ‘బాలకృష్ణుడు’, ‘వీర భోగ వసంతరాయలు’, ‘ప్రతినిధి 2’ ఇలా చాలా సినిమాలు చేశారు. కానీ ఆయనకు మాత్రం ఒక స్టార్ స్టేటస్ లభించలేదు అని చెప్పవచ్చు. ఇక హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు నారా రోహిత్. ఇకపోతే నారా రోహిత్ నటుడు గానే కాకుండా సింగర్ గా కూడా సత్తా చాటారు. అలా 2016లో వచ్చిన ‘సావిత్రి’ సినిమాలో ‘తీన్మార్’ పాట పాడి తనలోని టాలెంట్ ను అందరికీ పరిచయం చేశారు. ఇక నిర్మాతగా కూడా మారి 2014లో శ్రీ విష్ణు(Sri Vishnu ) హీరోగా వచ్చిన ‘నలదమయంతి’ అనే సినిమాను నిర్మించారు. ఇక 2013లో వచ్చిన స్వామిరారాకి వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు.
కొండంత రాజకీయ బ్యాక్ గ్రౌండ్..
నారా రోహిత్ ఎవరో కాదు చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు వారసుడే. అంతేకాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈయనకు పెదనాన్న అవుతారు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన నారా రోహిత్ కి చంద్రబాబు, నారా లోకేష్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఇకపోతే వెనుక కొండంత బ్యాగ్రౌండ్.. మంచి టాలెంట్ ఉన్నా.. నారా రోహిత్ మాత్రం అదృష్టం లేకే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నారా రోహిత్ సినిమాలు..
ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj) తో కలిసి ‘భైరవం’ సినిమా చేసిన ఇప్పుడు ‘సుందరాకాండ’ అనే సినిమాలో నటిస్తున్నారు. కనీసం ఈ సినిమానైనా నారా రోహిత్ ని హీరోగా నిలబెట్టాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
Also read: Kaikala SatyaNarayana: నవరస నటశిఖరం.. జయంతి సందర్భంగా స్పెషల్ ఫోకస్!