Sandeep Master : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు పెళ్లి గురించి అనౌన్స్ చేస్తారో? ఏ జంట విడాకులు తీసుకుపోతున్నాము అంటూ సడన్గా అనౌన్స్ చేస్తారో తెలియలేక సినీ అభిమానులు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈమధ్య ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వింటున్నాము. నిన్నగాక మొన్న హీరోయిన్ హన్సిక తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకున్నారా అనే వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. ఆ జంట మరెవరో కాదు.. డాన్స్ మాస్టర్ సందీప్, జ్యోతిక.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సందీప్ ను వదిలేసిన జ్యోతి..
డాన్స్ మాస్టర్ సందీప్ జ్యోతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో షోలలో సందడి చేశారు. అయితే వీరిద్దరూ విడిపోయారేమో అన్న వార్తలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. సందీప్ మాస్టర్ భార్య జ్యోతిరాజ్ రీసెంట్‌గా ప్రజెంట్ జనరేషన్‌ని ఉద్దేశించి ఓ వీడియో పెట్టారు. యంగ్ కపుల్స్ చాలా మంది చిన్ని చిన్న కారణాల తో విడాకులు తీసుకుని విడిపోతున్నారని చెప్తూ.. కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో సలహాలు ఇచ్చింది.. మొగుడి దగ్గర తగ్గితే పోయేదేమీ లేదు అని ఆ వీడియోలో జ్యోతి అన్నారు. ఆ వీడియోని చూసిన కొందరేమో ఆమెపై ప్రశంసలు కురిపిస్తే.. మరికొందరు మాత్రం ఆమెను తిట్టిపోస్తున్నారు.
Also Read :ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 14 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్..
జ్యోతి రాజ్ వీడియో..
ఆ వీడియో పై వస్తున్న కామెంట్స్ తో మరో వీడియోను రిలీజ్ చేసింది జ్యోతి.. నేను మొన్న ఒక వీడియో పెట్టాను. దానికి చాలామంచి రెస్పాన్స్ వచ్చింది. పర్సనల్‌గా కాల్ చేశారు. ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కానీ కొంతమంది మాత్రం ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిని చాలా ఘాటుగా స్పందిస్తున్నారు.. నేనెవరిని తప్పుగా ఉద్దేశించి అనలేదు బయట జరుగుతున్న వాస్తవాలనే వీడియో తీశాను అని జ్యోతి అన్నారు. అమ్మానాన్నలు కష్టపడి లక్షల పోసి పెళ్లిళ్లు చేస్తుంటే చిన్న చిన్న కారణాలతో విడిపోవడం చేస్తున్నారు. ఒకర్నొకరు అర్థం చేసుకుని ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతున్నారని అర్థం. కొన్ని విషయాల్లో మా వారు నాకు హెల్ప్ చేస్తారు. నేను తిరిగి హెల్ప్ చేస్తుంటా. భార్యాభర్తల మధ్య అండర్‌స్టాండింగ్ ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం అంటూ ఆ వీడియోని షేర్ చేసింది. వీడియో పై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. మరి దీనిపై జ్యోతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. వీరిద్దరూ కలిసి చేస్తున్న డ్యాన్స్ వీడియోల కు ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది వీరి డ్యాన్స్ క్లాసుల ద్వారా మాస్టర్స్ అయ్యారన్న విషయం తెలిసిందే. బుల్లితెర పై పలు షోలలో సందడి చేస్తుంటారు..