Hero Darshan: కన్నడ హీరోగా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న హీరో దర్శన్ (Hero Darshan) అభిమాని హత్యకేసులో గత ఏడాదికాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జైల్లో ఉన్న ఈయనకు సరైన సదుపాయాలు కల్పించడం లేదు అంటూ ఎప్పటికప్పుడు తన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇక మొన్నటికి మొన్న జైలులో ఉండలేకపోతున్నాను.. సరైన సదుపాయాలు లేవు.. కాస్త విషమిచ్చి నన్ను చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ అక్కడి పరిస్థితులను పరిశీలించి నివేదిక సమర్పించింది.
తమ నివేదికలో దర్శన్ ఉన్న బ్యారక్ లో సరిపడా మరుగుదొడ్లు, చాప, దిండు, దుప్పటి, రోజుకు ఒక గంట నడిచే అవకాశం కల్పించారని తమ నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా దర్శన్ ఎండ తగలకపోవడం వల్ల చర్మవ్యాధులు వస్తున్నాయని ఆరోపించగా.. అందులో నిజం లేదని.. అతడు చెప్పేది అబద్ధమని.. అతడికి ఎటువంటి చర్మవ్యాధులు లేవని కమిటీ తెలిపింది. టీవీ సదుపాయం కూడా సాధ్యం కాదని పేర్కొనడంతో ఇది కాస్త దర్శన్ కు ప్రతికూలంగా మారింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ విషయంపై ఉన్నత న్యాయస్థానం మండిపడినట్లు తెలుస్తోంది. దర్శన్ ఆరోపణలు అవాస్తవమని తేలడంతో తదుపరి నిర్ణయం ఉన్నత న్యాయస్థానం ఏ విధంగా తీసుకుంటుంది అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. మొత్తానికి అయితే ఈ విషయాలు ఇప్పుడు హీరో దర్శన్ ను సంకటంలో పడేసాయని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా హీరో దర్శన్ నెలవారీ హియరింగ్ లో భాగంగా జైలు నుంచే వీడియో కాల్ ద్వారా కోర్టు హియరింగ్ లో పాల్గొన్నారు. అందులో బోరున విలపించారు. ” నేను నెల రోజులకు పైగా ఎండ అన్నదే చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకింది. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో నేను బ్రతకలేను. ఒక్క చుక్క విషయం ఇవ్వండి. నేను చచ్చిపోతాను.. ఈ జీవితం చాలా దుర్భరంగా తయారైంది” అంటూ విలపించాడు.
ALSO READ:Hero Vishal: 8కోట్ల మంది ఇష్టాన్ని 8మంది నిర్ణయించలేరు..అవార్డులన్నీ చెత్తబుట్టలోకే!
ఇకపోతే గత ఏడాది తన అభిమాని రేణుక స్వామి (Renuka Swamy) ని హీరో దర్శన్ హత్య చేసిన విషయం తెలిసిందే. తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ కు రేణుక స్వామి అసభ్యకరమైన మెసేజ్లు పంపడమే దీనికి కారణం. మొదట అతడిని కిడ్నాప్ చేసిన దర్శన్.. బెంగళూరులోని ఒక షెడ్డులో పెట్టి చిత్రహింసలు పెట్టాడట. తర్వాత రేణుక స్వామి బాడీ దగ్గరలోని ఒక నాళాలో దొరికింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శన్ తో పాటు పవిత్ర గౌడ అలాగే ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులను కూడా గత ఏడాది జూన్లో అరెస్టు చేశారు. డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చిన వీరిపై బెంగళూరు పోలీసులు తిరిగి పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు ఆ బెయిల్ ని రద్దు చేసింది. ప్రస్తుతం వీరంతా జైలు జీవితాన్ని గడుపుతున్నారు.