IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 1st ODI ) మధ్య ఇవాళ వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ పెర్త్ వేదికగా రెండు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియాకు ఏమాత్రం కలిసిరాలేదు. టాస్ పడినప్పటి నుంచి, మొదటి బ్యాటింగ్ పూర్తయ్యే వరకు పదేపదే వర్షం పడింది. దీంతో 50 ఓవర్ల మ్యాచ్ ను కాస్త 26 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలోనే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగింది. ఈ నిర్ణయం ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన టీమిండియా 136 పరుగులు చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలవాలంటే 26 ఓవర్లలో 137 పరుగులు చేయాల్సి ఉంటుంది.
పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డే లో వర్షం టీమ్ ఇండియాకు విలన్ గా మారింది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఊపు తగ్గించేందుకు వర్షం పదే పదే పడింది. దీంతో బంతి పూర్తిగా బౌలర్లకు అనుకూలించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆకట్టుకుంటారనుకున్న రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. అలాగే టీమిండియా కొత్త కెప్టెన్ గిల్ కూడా తొందరగానే పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కాస్త టచ్ లోకి వచ్చాడు.
కానీ మళ్ళీ వర్షం పడింది. ఆ సమయానికి 35 ఓవర్లుగా మ్యాచ్ కుదించారు. మళ్లీ వర్షం పడడంతో శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత రంగంలోకి కేఎల్ రాహుల్ దిగాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ వర్షం పడింది. దాంతో 26 ఓవర్లకు మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఇలా వర్షం పడడం, ఓవర్లు తగ్గించడం జరిగింది. ఈ ఒత్తిడి టీమిండియా బ్యాటర్ల పై పడిపోయింది. ఇంకేముంది 26 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన టీమిండియా 136 పరుగులు మాత్రమే చేసింది.
చాలా రోజుల తర్వాత వన్డే క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు. రోహిత్ శర్మ 8 పరుగులు చేసి అవుట్ కాగా, విరాట్ కోహ్లీ అయితే డక్ ఔట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ తొందరగా అవుట్ కావడంతో.. సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ వస్తున్నాయి. ఇన్ని రోజులు ఆగం… మీరు బాగా ఆడతారు అనుకున్నాం.. కానీ గౌతమ్ గంభీర్ కు ఆయుధం ఇచ్చేలా దారుణంగా విఫలమయ్యారు.. ఇలా ఆడితే మీరు మళ్లీ జట్టులో ఉంటారా ? అంటూ సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.