Nara Rohit -Siri Lella: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న వారిలో నారా రోహిత్ (Nara rohit)ఒకరు. సోలో, ప్రతినిధి, బాణం వంటి ఎన్నో విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈయన ప్రముఖ నటి సిరిలెల్లా(Siri lella)ను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం(Engagment) ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత ఏడాది వీరి నిచ్చితార్థం జరగగా ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.
వీరి నిశ్చితార్థం అనంతరం నారా రోహిత్ తండ్రి మరణించడంతో ఈ పెళ్లి కాస్త ఆలస్యం అయింది. అయితే అక్టోబర్ చివరి వారంలో వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు వీరి పెళ్లి తేదీ ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు కానీ తాజాగా నటి సిరిలెల్లా సోషల్ మీడియా వేదికగా పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో త్వరలోనే వీరి వివాహం జరగబోతుందని స్పష్టమవుతుంది. ఇలా నారా వారింట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సిరి లెల్లా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో సాంప్రదాయ బద్దంగా పసుపు దంచే కార్యక్రమాన్ని(Haldi Ceremony) ప్రారంభించారని తెలుస్తోంది. ఇక ఈ వేడుకలలో సిరి చాలా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఇలా హల్ది వేడుకకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరి పెళ్లి ఎక్కడ ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక రోహిత్ సిరి ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.
నారా రోహిత్ సిరి జంటగా ప్రతినిధి 2 సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఈ జంట తమ ప్రేమ విషయాన్ని తెలియజేస్తూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. నారా రోహిత్ తండ్రి మరణం కారణంగానే వీరి పెళ్లి ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక నారా రోహిత్ కుటుంబానికి సినీ నేపథ్యం మాత్రమే కాకుండా మంచి రాజకీయ నేపథ్యం ఉంది. నారా రోహిత్ పెదనాన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక నారా రోహిత్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోహిత్ ఈ సినిమా ద్వారా పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక ఇటీవల సుందరకాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
Also Read: Kiran Abbavaram: పవన్ సినిమాలలో అసలు నటించను…అభిమాని అయితే నటించాలా?