Hero Vishal: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal ) ఒకవైపు తమిళ్లో సినిమాలు చేస్తూనే.. ఆ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. వాస్తవానికి ఈయన తెలుగు హీరో అయినప్పటికీ కోలీవుడ్లో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అలా ఒకవైపు హీరోగా.. మరొకవైపు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా.. ఇంకొక వైపు నిర్మాతగా కూడా బిజీగా మారిన ఈయన తాజాగా అవార్డుల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా 8కోట్ల మంది ఇష్టాన్ని 8మంది జడ్జిలు ఎలా నిర్ణయిస్తారు? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు తనకు వచ్చే అవార్డులన్నీ కూడా చెత్తబుట్టలోకే వేస్తానని చెప్పి సంచలన కామెంట్లు చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హీరో విశాల్ ట్విట్టర్ వేదికగా.. “యువర్స్ ఫ్రాంకీ విశాల్” పేరుతో ఒక పాడ్ కాస్ట్ మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని చెబుతూ ఊహించని కామెంట్లు చేశారు. అందులో భాగంగానే విశాల్ మాట్లాడుతూ.. ” 8 కోట్ల మందికి ఏం నచ్చుతుందో 8 మంది నిర్ణయించలేరు కదా.. అటు నేషనల్ అవార్డులతో సహా అన్నింటిని నిర్ణయించడం 8 మంది వల్ల ఎలా అవుతుంది. నిజానికి నాకు అవార్డులు రావు కాబట్టి ఇలా అంటున్నారని అనుకోవచ్చు. కానీ నేను అలా అనడం లేదు.సరిగ్గా అర్థం చేసుకుంటే నేను చెప్పింది నిజమే కదా అనిపిస్తుంది. నిజానికి నాకు ఎవరైనా అవార్డులు ఇస్తే ఆ అవార్డులను చెత్తబుట్టలో వేస్తాను. ఒకవేళ బంగారంతో చేసిన అవార్డులను ఇస్తే వాటిని అమ్మి వచ్చిన ఆ డబ్బులను ఛారిటీకి విరాళంగా ఇస్తాను” అంటూ విశాల్ ఊహించని కామెంట్లు చేశారు. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విశాల్ ఇంకా మాట్లాడుతూ..”నేను షూటింగ్ సెట్లో ఎన్నోసార్లు గాయపడ్డాను. ఇప్పటివరకు నా శరీరం పై 119 కుట్లు పడ్డాయి. కానీ నేను చేసిన యాక్షన్ సీన్స్ కి ప్రేక్షకులు ఇచ్చే స్పందన చూసి ఆ గాయాలన్నింటినీ నేను ఎప్పుడో మర్చిపోయాను. నా సినిమాలలో డూపు లేకుండా నేను నటించే యాక్షన్ సీన్స్ సహజంగా రావడం కోసమే నేను కష్టపడ్డాను. ఆ సమయంలోనే ఇలా నా శరీరం పలు సార్లు గాయాల పాలయ్యింది. ముఖ్యంగా నేను చేసే స్టంట్ లు సహజంగా ఉండాలని కోరుకుంటాను. కాబట్టి డూప్ అవసరం అనిపించినా నేనే చేస్తాను. సేఫ్టీ పద్ధతులను ఉపయోగిస్తూ నేచురల్ గా స్టంట్స్ చేస్తాను. అయినప్పటికీ ఇలా ఎన్నోసార్లు గాయపడ్డాను. ఇటీవల యాక్షన్ సీన్ లో చేతికి లోతైన గాయం కావడంతో ఏకంగా 17 కుట్లు వేశారు” అంటూ తెలిపారు.
ALSO READ: Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!
My Unfiltered Side is here‼️
Real talk. Raw emotions. Unseen perspectives.
Step into #YoursFranklyVishal 🎙️https://t.co/az9gjHxz33
— Vishal (@VishalKOfficial) October 18, 2025