IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఈ రెండు జట్లు ఇవాళ తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన కంగారులు… తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ కు వర్షం పదే పదే అడ్డు రావడంతో… టీమిండియా ప్లేయర్లు కూడా పెద్దగా రాణించలేదు. దానికి తోడు ఆస్ట్రేలియా టాస్ గెలవడం టీమిండియా కొంపముంచినట్లు అయింది. టీమిండియా ఉంచిన 131 పరుగుల టార్గెట్ ను కేవలం 3 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో ఆసీస్ లీడ్ సాధించింది.
డక్ వర్త్ లూయిస్ పద్ధతి ( Duckworth-Lewis Method ) ప్రకారం తొలి వన్డేలో టీమ్ ఇండియా దారుణంగా ఓడిపోయింది. పెడుతూ వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ కు వర్షం విలన్ గా మారింది. దీనికి తగ్గట్టుగానే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ తీసుకుని, మ్యాచ్ ను తన చేతిలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మొదట టీమిండియా బ్యాటింగ్ చేసింది. బంతి పూర్తిగా బౌలర్లకు అనుకూలించడంతో, టీమిండియా బ్యాటర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేయగా, కొత్త కెప్టెన్ గిల్ 10 పరుగులకు వెనుతిరిగాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఖాతా ఓపెన్ చేయకుండానే పెవీలియన్ బాట పట్టాడు విరాట్ కోహ్లీ.
దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ లో 39 సార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 11 పరుగులకు వికెట్ ఇచ్చేశాడు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 31 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 38 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అటు వాషింగ్టన్ సుందర్ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. మరో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి చివరి ఓవర్ లో ఏకంగా రెండు సిక్సర్లు కొట్టి 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. DLS రూల్ ప్రకారం ఈ మ్యాచ్ కు 26 ఓవర్లు ఫిక్స్ చేశారు.
దీంతో 9 వికెట్లు నష్టపోయిన టీమిండియా 136 పరుగులు చేసింది. అటు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం… 26 ఓవర్లలో 130 పరుగులు ఆస్ట్రేలియా చేయాల్సి వచ్చింది. దీంతో 21.1 ఓవర్లలోనే మూడు వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా 131 పరుగులు చేసింది. దీంతో ఇండియా పై మొదటి వన్డేలో విజయం సాధించింది కంగారు జట్టు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ వన్ మ్యాన్ షో నడిపించాడు. టార్గెట్ చిన్నదిగా ఉండడంతో 46 పరుగులు చేసి దుమ్ము లేపాడు. చివరివరకు ఉండి మ్యాచ్ గెలిపించుకున్నాడు.