Smriti Mandhana Wedding: టీమిండియా మహిళల జట్టుకు సంబంధించిన స్టార్ ప్లేయర్ స్మృతి మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ కోహ్లీగా పేరు గాంచిన స్మృతి మందాన, అద్భుతంగా రాణిస్తూ టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలను అందించారు. ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ లో కూడా స్మృతి మందాన రాణిస్తున్నారు. అయితే వరల్డ్ కప్ లో బిజీగా ఉన్న స్మృతి మందాన అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చారు. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ ( Palash Muchhal)ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారట స్మృతి మందాన. ఇప్పటికే వీళ్లిద్దరూ లవర్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వరల్డ్ కప్ తర్వాత ఈ జంట ఒకటి కాబోతుందట. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందానతో పెళ్లిపై తాజాగా పలాష్ ముచ్చల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిమానులందరికీ శుభవార్త.. త్వరలోనే మీరందరూ అనుకునేది, ఊహించింది జరగబోతోంది… త్వరలో నా ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాను.. ఆమె ఇండోర్ కోడలు కాబోతుంది… ఇక ఏ మాత్రం ఆలస్యం చేయబోను అంటూ పలాష్ ముచ్చల్ వెల్లడించారు. దీంతో స్మృతి మందానతో పలాష్ ముచ్చల్ వివాహం ఖాయమైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని నేషనల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. స్మృతి మందాన పెళ్లి తర్వాత కూడా క్రికెట్ ఆడుతుందని అతడు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పెళ్లికి అలాగే క్రికెట్ కు ఎలాంటి సంబంధం ఉండదని.. కచ్చితంగా జాతీయ జట్టులో ఆమె కొనసాగుతుందని అతడు చెప్పుకొచ్చాడట.
టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన ప్రేమాయణం ఇప్పటిదేమీ కాదు. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ ( Palash Muchhal) తో 2019 నుంచి ప్రేమాయణం నడిపిస్తోందట స్మృతి మందాన. అయితే, 2019లోనే మొదటగా ప్రపోజ్ చేశాడట పలాష్ ముచ్చల్. ఓ పాట ఆమె కోసం అంకితం చేసి, ప్రపోజ్ చేశాడు. కొన్ని రోజుల పాటు వీరి ప్రేమ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. కానీ ఆ తర్వాత రివీల్ అయింది. ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళుతోంది. ఇది ఇలా ఉండగా, మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో స్మృతి మందాన అదరగొడుతున్నారు. ముందు మ్యాచ్ లలో పెద్దగా రాణించకపోయినా, తర్వాతి మ్యాచ్ లలో గాడిలో పడ్డారు. ఈ తరుణంలోనే ఈ ఏడాదిలో 1000 పరుగులు సాధించింది.
🚨 Bollywood meets Cricket 💍🎶
Palash Muchhal & Smriti Mandhana tie the knot — a union that’s winning hearts across India! pic.twitter.com/6VsxJuOddu— OneVision Media (@onevision_media) October 19, 2025