Regina Cassandra: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. SMS సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఎవరు తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. అలా తమిళ్, హిందీ వంటి భాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది రెజీనా. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ప్రెగ్నెంట్ అంటూ సడన్ షాక్ ఇచ్చింది ఈ విషయం తెలిసి నెటిజెన్సే కాదు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . ఇలా సడన్ ట్విస్ట్ ఇచ్చావ్ ఏంటి తల్లి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. రెజీనాకు ఆహారం అంటే చాలా ప్రాణమని.. అయితే అదే సమయంలో తాను ఏమి తింటున్నానో..ఎంత తింటున్నానో అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని వెల్లడించింది. అయితే షూటింగ్ సమయంలో తాను ఎప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తానని తెలిపింది. ఎందుకంటే తనకు తినే సమయం కూడా ఒక సెలబ్రేషన్స్ లా చేసుకుని తినడం అలవాటని, అలా ఒకసారి బెంగళూరులో షూటింగ్ జరుగుతున్న సమయంలో బెంగాలీ స్వీట్ అయిన మిష్టి దోయ్(తీపి పెరుగు) తినాలనే కోరిక తనలో కలిగిందని తెలిపింది.
దానికోసం నగరంలో పలు స్వీట్ షాపులు తిరిగినా కూడా ఎక్కడా దొరకలేదు. అయితే చివరికి ఒక షాపు దగ్గరికి వెళ్లగా అప్పటికి అది మూసివేసారని, షాపు ఉద్యోగి ఇప్పుడే క్లోజ్ చేసాం మేడం సర్వ్ చేయలేమని చెప్పడంతో కొంతసేపు తాను ఆలోచించి.. సరదాగా ఒక చిన్న అబద్ధం చెప్పానని తెలిపింది.. అదేమిటంటే తాను గర్భవతినని.. స్వీట్ తినాలనే కోరిక తీవ్రంగా ఉందని.. దయచేసి ఒక బౌల్ ఇప్పించండి అని అడిగానని తెలియజేసింది. అయితే ఆ విషయం విన్న ఆ షాపు యజమాని వెంటనే ఆశ్చర్యపోయి షాపును తిరిగి తెరిచి మరి మిష్టి దోయ్ తనకు సర్వ్ చేశారని తెలిపింది.అలా రెజీనా చెప్పిన ఈ విషయం అటు అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
మిష్టి దోయ్ కోసం ఇంత కష్టపడ్డావా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం రెజీనా చెప్పిన ఈ చిన్నపాటి అబద్ధాలు కూడా చాలా క్యూట్ గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెజీనా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్, మూకూతి అమ్మన్ 2, ది వైస్ తదితర చిత్రాలలో కూడా నటిస్తోంది రెజీనా. మరొకవైపు సినిమాలలో నటిస్తూనే.. పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మరింతగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే కోరిక తీర్చుకోవడానికి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది రెజీనా.
ALSO READ:Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ కి గెస్ట్ గా హిందీ కంటెస్టెంట్.. ఆమె ఇచ్చిన సలహా విన్నారా?