Megastar Chiranjeevi: తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నేడు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇల్లు పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని చిరంజీవి చేసుకున్న దరఖాస్తును పరిశీలించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇల్లు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రిటెయిన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5వ తేదీన జిహెచ్ఎంసి కి చేసుకున్న దరఖాస్తు పై స్పందన లేదు అంటూ చిరంజీవి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ఇటీవల విచారణ జరిపారు.
విచారణను ముగించిన హైకోర్టు..
ఇక ఈ విషయంపై న్యాయవాది మాట్లాడుతూ..” 2002లో గ్రౌండ్తో పాటు మరో రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకొని, నిర్మించాక.. పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నామని” తెలిపారు. తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలన్న అభ్యర్థనను జిహెచ్ఎంసి పట్టించుకోలేదని కూడా తెలిపారు. ఇక దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. చట్టప్రకారం దరఖాస్తు పై చర్యలు తీసుకోవాలని.. పిటిషనర్ దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిష్కరించాలి అని జిహెచ్ఎంసిని హైకోర్టు ఆదేశిస్తూ.. ఇప్పుడు విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది.
చిరంజీవి సినిమాలు..
మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే సుప్రీం హీరోగా పేరు దక్కించుకున్న ఈయన.. ఆ తర్వాత తన నటనతో మెగాస్టార్ గా పేరు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు చేస్తున్న చిరంజీవి.. అందుకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ ని కూడా భారీగా పెంచేశారని చెప్పవచ్చు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సక్సెస్ అందుకున్న చిరంజీవి.. ఆ తర్వాత వచ్చిన ‘భోళాశంకర్’ సినిమాతో డిజాస్టర్ ను మూటకట్టుకున్నారు. ఆ తర్వాత వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా ప్రకటించారు. ఇప్పటికే రెండుసార్లు విడుదల వాయిదా పడింది ఈ సినిమా. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు కానీ ఇంకా పనులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఆశలన్నీ మెగా 157 పైనే
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తోంది.. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలను కూడా అనిల్ రావిపూడి చేపట్టిన విషయం తెలిసిందే. అంతే కాదు డ్రామా జూనియర్స్ లో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఇరియా అనే చైల్డ్ ఆర్టిస్టును కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ALSO READ:Film industry: దిగ్గజ నటుడి పరిస్థితి విషమం.. వెంటిలేటర్ పై చికిత్స!