Film industry:ఈమధ్య కాలంలో వరుసగా సెలబ్రిటీలు అనారోగ్య బారిన పడడం.. మరికొంతమంది ఏకంగా ప్రాణాలే కోల్పోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న దిగ్గజ తెలుగు నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) వృద్ధాప్య కారణాలతో మరణించగా.. నిన్నటికి నిన్న ప్రముఖ సీనియర్ హీరోయిన్ బి.సరోజా దేవి (B.Saroja Devi) కూడా వృద్ధాప్య కారణాలతో మరణించారు. అయితే ఇప్పుడు మరొక నటుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసి, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు..
ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు అయినా ధీరజ్ కుమార్ (Dheeraj Kumar) ప్రస్తుతం హాస్పిటల్లో చేరారు. నిమోనియా కారణంగా కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో ఆయన ప్రాణాల కోసం పోరాడుతున్నారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వెంటిలేటర్ పై ప్రముఖ నటుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు అని తెలిసి అభిమానులు, సెలబ్రిటీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన త్వరలోనే కోలుకొని మళ్లీ ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఉండాలి అని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ధీరజ్ కుమార్ కి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ధీరజ్ కుమార్ సినీ కెరియర్..
ధీరజ్ కుమార్ విషయానికి వస్తే.. 1965లో వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టారు. యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అలాగే ఫిలింఫేర్ నిర్వహించిన టాలెంట్ షో లో సుభాష్ ఘాయ్, రాజేష్ ఖన్నా తో పాటు టాలెంట్ షో ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు ధీరజ్. చివరికి రాజేష్ ఖన్నా విజేతగా నిలవడం జరిగింది. అయితే ఈ షో ఆయనకు సినిమాలలోకి ప్రవేశించడానికి సహాయపడింది. ఇక 1970 నుండి 1984 వరకు 21 పంజాబీ చిత్రాలలో నటించిన ఈయన క్రియేటివ్ ఐ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి, దానికి చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. హీరా పన్నా, రాతోన్ కా రాజా, శ్రీ మాన్ శ్రీమతి వంటి చిత్రాలలో కూడా పనిచేశారు. ఇక అంతే కాదు 1977లో వచ్చిన స్వామి అనే చిత్రంలో..” కా కరూన్ సజాని, ఆయే నా బలం” అనే పాట ఈయనపై చిత్రీకరించడం జరిగింది.
ధీరజ్ కుమార్ నటించిన సినిమాలు..
ఇక ఈయన నటించిన సినిమాల విషయానికొస్తే 1970లో దీదార్ అనే సినిమాలో నటించారు. ఒక 1971లో రాతోన్ కా రాజా , బిజులి, హీరా పన్నా, షరాఫత్ చోడ్ ది మైనే, రోటీ కపడా ఔర్ మకాన్ , రంగ ఖుష్, అంగారే, దాజ్, స్వామి, షిర్డీ కే సాయి బాబా వంటి పలు చిత్రాలలో నటించారు. ఇక బాలీవుడ్లో తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన తెలుగులో మాత్రం సినిమాలు చేయలేదు.
దర్శకుడు నిర్మాత గానే కాకుండా బుల్లితెరపై కూడా సత్తారు. 2003లో డిడి నేషనల్ ఛానల్ లో ప్రసారమైన ఘర్ సంసార్ అనే సీరియల్ లో నటించారు.
ALSO READ:Pawan Vs Allu Arjun: మళ్లీ పవన్ తో సై అంటున్న అల్లు కాంపౌండ్.. ఈసారి ఏమైందంటే?