Kothapalli lo okappudu : తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త సినిమాలను ఆదరిస్తారు. ఒకవేళ ఆ సినిమా బాగుంది అంటే దానికి బ్రహ్మరథం పడతారు. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన ఎన్నో సినిమాలు క్లాసిక్ లా మారాయి. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన కేరాఫ్ కంచరపాలెం సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా క్లైమాక్స్ అందర్నీ విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ సినిమాతో వెంకటేష్ మహా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాని చేశాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలైంది. అయితే కంచరపాలెం సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ప్రవీణ పరుచూరి తెరకెక్కించిన సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు.
సినిమా నిండా బూతులే
కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ట్రైలర్ రీసెంట్ గానే విడుదలైంది. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను సెన్సార్ వాళ్ళకి చూపించారు. ఏకంగా ఈ సినిమాలో సెన్సార్ 10 కట్స్ చెప్పింది. ప్రతి కట్ లో కూడా విపరీతమైన బూతులు ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలు నిర్మించింది ఈ సంస్థ. ఈ సినిమాను రానా ప్రెజెంట్ చేస్తున్నాడు అంటే అంచనాలు చాలామందికి పెరిగిపోయాయి. అయితే రానా ప్రజెంట్ చేస్తున్న సినిమాలు ఇన్ని బూతులు ఎందుకు అనేది కొంతమంది అభిప్రాయం. ఆ విషయానికి వస్తే రానా నాయుడు సినిమాలోనే చాలా బూతులు ఉంటాయి అనేది ఇంకొంతమంది అభిప్రాయం. రానా నాయుడు సినిమాలో బూతులు ఉండటం వల్లనే ఈ సినిమాల్లో కూడా కామన్ గా అనిపించి రానా ప్రజెంట్ చేస్తున్నాడా.?
ఆసక్తికరమైన ట్రైలర్
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు అని తెలిసిన విషయమే. అందుకే కొత్త కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎప్పటికీ హిట్ అవుతూ ఉంటాయి. ఇక కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రవీణ పరుచూరి దర్శకత్వం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తి సినిమా ఎలా ఉంటుందో తెలియదు గానీ ట్రైలర్ అయితే మాత్రం సినిమా చూడాలి అని ఆసక్తిని మాత్రం రేకెత్తించింది. ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోస్ పలుచోట్ల వేశారు. హైదరాబాదులో కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో వేయనున్నారు. ఆల్రెడీ ప్రీమియర్ షోస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Also Read: Paruchuri On Kota Srinivasa Rao : కోట శ్రీనివాస్ రావు గురించి కన్నీళ్లు తెప్పించే పరుచూరి మాటలు