E-Paper
Advertisement

Hema Malini: ధర్మేంద్ర మృతి.. హేమ మాలిని ఎమోషనల్ పోస్ట్.. శూన్యత అంటూ!

Hema Malini: ధర్మేంద్ర మృతి.. హేమ మాలిని ఎమోషనల్ పోస్ట్.. శూన్యత అంటూ!
Advertisement

Hema Malini: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) గత మూడు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈయన శ్వాస తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకున్నారు. ఇక ఈయన ఆరోగ్యం మెరుగు పడుతుందని ఇంటికి డిస్చార్జ్ చేశారు అయితే ఉన్నఫలంగా ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ఇండియన్ సినీ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.

ధర్మేంద్ర గొప్ప మార్గదర్శి..

తాజాగా తన భర్త మరణం పై నటి హేమమాలిని (Hema Malini)స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడమే కాకుండా ధర్మేంద్రతో తన అనుబంధం గురించి కూడా తెలియజేస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా హేమామాలిని తన అధికారిక ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ధరమ్ జీ.. చాలా ప్రేమ గల భర్త. మా ఇద్దరూ కూతుర్లు ఈషా, అహానాకు ఎంతో ప్రియమైన ఆరాధ్యుడైన తండ్రి. వారికి తన తండ్రి అంటే ఒక గొప్ప స్నేహితుడు, తత్వవేత్త, ఒక మార్గదర్శి, గొప్ప కవి అని తెలిపారు. ధర్మేంద్ర తనకు మంచి, చెడు సమయంలోనూ అండగా నిలిచారని తెలియజేశారు. ధర్మేంద్ర ఎల్లప్పుడూ తన కుటుంబ సభ్యులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలగడమే కాకుండా వారందరి పట్ల ఎంతో ఆప్యాయతను చూపించేవారని హేమమాలిని తెలియజేశారు.

నాకు జరిగిన నష్టం వర్ణించలేనిది..

Advertisement

ఒక ప్రజా వ్యక్తిగా అతనికి ప్రతిభ , ప్రజాదరణ ఉన్నప్పటికీ ఆయన వినయం అతనిని ఉన్నత శిఖరానికి చేర్చాయని, చలనచిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర కీర్తి ప్రతిష్టలు, సాధించిన విజయాలు శాశ్వతంగా ఉంటాయని తెలిపారు. ధర్మేంద్ర మరణంతో వ్యక్తిగతంగా నాకు జరిగిన నష్టం మాటలలో చెప్పలేనిది. ఆయన మరణంతో నా జీవితం మొత్తం శూన్యత మిగిలి ఉంటుందని, ఇన్నేళ్లు కలిసి జీవితంలో ముందుకు సాగిన తర్వాత ఆ క్షణాలను తిరిగి పొందడం కోసం నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ హేమామాలిని తన భర్త మరణం గురించి ఎమోషనల్ అవుతూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Advertisement

ఇలా తన భర్త గురించి ఈమె వరుస పోస్టులు చేయడమ కాకుండా ధర్మేంద్రతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ధర్మేంద్ర మరణం తర్వాత హేమమాలిని మొదటిసారి ఆయన మరణాన్ని గుర్తుచేసుకొని తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వరుస పోస్టులను ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక ధర్మేంద్రకు హేమమాలిని రెండవ భార్య అనే సంగతి తెలిసిందే. మొదటి భార్యకు బాబీ డియోల్, సన్నీ డియోల్ అనే కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక హేమమాలినికి ఇద్దరు కూడా అమ్మాయిలు కావటం విశేషం. ధర్మేంద్ర 89వ సంవత్సరంలో కన్నుమూశారు. వచ్చే డిసెంబర్ నెలలో ధర్మేంద్ర 90వ వసంతంలోకి అడుగుపెట్టేవారు. ఈలోపు ఇలాంటి ఘటన జరగడంతో అభిమానులు కూడా ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగాపురం’ గా ఘట్టమనేని జయకృష్ణ మొదటి సినిమా..

 

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×