E-Paper
Advertisement

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగాపురం’ గా ఘట్టమనేని జయకృష్ణ మొదటి సినిమా..

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగాపురం’ గా ఘట్టమనేని జయకృష్ణ మొదటి సినిమా..
Advertisement

Srinivasa Mangapuram : ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ భూపతి(Ajay Bhupati) తాజాగా ఘట్టమనేని వారసుడు జయకృష్ణ(Jaya Krishna)ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. దివంగత సీనియర్ నటుడు కృష్ణ గారి మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడిగా జయకృష్ణ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నారు. తాజాగా జయ కృష్ణ మొదటి సినిమాకి సంబంధించిన టైటిల్ విడుదల చేశారు. ఈ సినిమాకు “శ్రీనివాస మంగాపురం”(Srinivasa Mangapuram) అనే టైటిల్ పెట్టినట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించడంతో ఈ పోస్టర్ కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ లో తుపాకీ చేత పట్టుకొని కనిపించడంతో కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ప్రేమ కథ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాలో జయ కృష్ణకు జోడిగా ప్రముఖ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ(Rasha Thadani) హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రేమ కథ మీ హృదయాల్లో నిలిచిపోతుంది..

ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ డైరెక్టర్ అజయ్ భూపతి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఈ ప్రేమ కథ మీ హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పుకువచ్చారు. దీన్నిబట్టి చూస్తుంటే ఈ సినిమా ఒక మంచి ప్రేమ కథ సినిమాగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, అది కూడా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాని అధికారకంగా ప్రకటిస్తూ తిరుపతి బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ సినిమా కాస్త ఆసక్తికరంగా మారింది. ఇలా మొదటి సినిమానే యాక్షన్ సినిమా లేదా ప్రయోగాత్మక సినిమాలు కాకుండా మంచి ప్రేమ కథ సినిమాతో రావడంతో ఘట్టమనేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు కూడా ప్రారంభమైనట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్(G.V Prakash) సంగీతం అందించబోతున్నారు. ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పణలో జెమినీ కిరణ్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఘట్టమనేని కుటుంబం నుంచి మూడోతరం వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100, మంగళవారం, మహాసముద్రం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అజయ్ భూపతికి శ్రీనివాస మంగాపురం నాలుగవ సినిమా కావటం విశేషం.

Advertisement

Also Read: Manchu Lakshmi: వాళ్లు లేకపోతే నేను లేను…ఎమోషనల్ అయిన మంచు లక్ష్మీ!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×