BigTV English

Tollywood: సోషియో ఫాంటసీ మూవీతో అల్లరి నరేష్.. రేపే పూజా కార్యక్రమం!

Tollywood: సోషియో ఫాంటసీ మూవీతో అల్లరి నరేష్.. రేపే పూజా కార్యక్రమం!

Tollywood: దివంగత దిగ్గజ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ (EVV Sathyanarayana) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నరేష్ (Naresh ). అల్లరి (Allari) అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈయన.. ఇదే సినిమా టైటిల్ ను ఇంటిపేరుగా మార్చుకున్నారు.. ప్రస్తుతం అల్లరి నరేష్ గా కొనసాగుతున్న ఈయన..’గమ్యం’ చిత్రంలో గాలి శ్రీను , ‘శంభో శివ శంభో’ సినిమాలో మల్లి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యు , తొట్టి గ్యాంగ్ , ప్రాణం, మా అల్లుడు వెరీ గుడ్ ఇలా కామెడీని ప్రధానంగా చేసుకుంటూ హీరోగా పలు చిత్రాలు చేశారు అల్లరి నరేష్.


సోషియో ఫాంటసీ మూవీతో రాబోతున్న అల్లరి నరేష్..

అప్పటివరకు కామెడీ హీరోగా పేరు సొంతం చేసుకున్న అల్లరి నరేష్.. 2021లో ‘నాంది’ సినిమాతో తనలోని మరో యాంగిల్ ను చూపించారు. ఇందులో సీరియస్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి చిత్రాలు చేశారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అటు బచ్చలమిల్లి సినిమాతో కూడా ఊహించిన సక్సెస్ అయితే లభించలేదు. ఇక ప్రస్తుతం సభకు నమస్కారం సినిమా నిర్మాణంలో ఉండగా.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఇప్పుడు సోషియో ఫాంటసీ మూవీగా రాబోతున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


ఆ నిర్మాణ సంస్థల కలయికలో..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పుడు అల్లరి నరేష్ నటించబోయే మూవీకి హాస్య మూవీస్ , అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలను రేపు ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం.. ఈ మధ్యకాలంలో విభిన్నమైన పాత్రలను ట్రై చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్న అల్లరి నరేష్ ఇప్పుడు సోషియో ఫాంటసీ మూవీతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.

అల్లరి నరేష్ వ్యక్తిగత జీవితం..

అల్లరి నరేష్ ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా లీడ్ చేస్తున్నారు. 2015 మే 29న హైదరాబాద్ N కన్వెన్షన్ సెంటర్లో విరూపా అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఈమెది చెన్నై కావడం గమనార్హం.

అల్లరి నరేష్ కుటుంబ విశేషాలు..

1982 జూన్ 30న ఆంధ్రప్రదేశ్ కోరుమామిడిలో ఈవీవీ సత్యనారాయణ, సరస్వతీ కుమారి దంపతులకు జన్మించారు అల్లరి నరేష్.. ఈయన అన్నయ్య ఆర్యన్ రాజేష్ (Aryan Rajesh) కూడా సినీ నటుడే కావడం గమనార్హం. ఆర్యన్ రాజేష్ కి తమ్ముడి స్థాయిలో సక్సెస్ లభించకపోవడంతో ఆయన ఒకటి రెండు సినిమాలకే హీరోగా పరిమితమయ్యారు. ఈమధ్య రీ ఎంట్రీ ఇవ్వాలని చూసినా వర్కౌట్ కాక బిజినెస్ రంగంలోనే స్థిరపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఉత్తమ నటుడిగా నిలబెట్టిన చిత్రాలు..

ఇకపోతే అల్లరి నరేష్ సినిమాలలో హీరోగానే కాకుండా సహాయ నటుడిగా కూడా చేసి అవార్డులు అందుకున్నారు.. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన చేసిన హీరో పాత్రల కంటే సహాయ నటుడి పాత్రలే ఆయనను నటుడిగా నిలబెట్టాయి. అలా గమ్యం సినిమాకి గానూ 2008లో ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించగా.. మహర్షి సినిమాకు 2019లో ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డు లభించింది.

ALSO READ:Tollywood: హీరోలే కాదు హీరోయిన్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్సే.. ఆ జాబితాలో ఉన్నది ఎవరంటే?

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×