Pregnant Woman Incident: కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆలోచన లేకుండా చేసిన పనికి రెండు ప్రాణాలు బలయ్యాయి. ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్న దంపతులకు.. మూడోది కూడా ఆడబిడ్డ అని తేలియడంతో జీర్ణించుకోలేకపోయారు. నందికొట్కూరులోని గీతారాణి అనే RMP వైద్యురాలిని సంప్రదించి అబార్షన్ వైపు అడుగులు వేసారు వీరు. నిభందనలకు విరుద్దంగా ఆ RMP డాక్టర్ చేసిన అబార్షన్ వికటించడంతో గర్బిణి మృతి చెందినట్లుగా సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకోని పరారైన వైద్యురాలు గీతారాణి.. అలాగే ఆసుపత్రికి ఎలాంటి బోర్డు లేకుండా ఈమె వైద్యం చేస్తుంది. అయితే ఈమె డబ్బుకు ఆశపడి ఇలాగే ఎన్నో అబార్షన్లు చేసినట్టు అక్కడి స్థానికుల ఆరోపణలు చేస్తున్నారు.
అసలు వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరులోని శ్రీవాణి అనే మహిళ.. గత కొంత కాలంగా ప్రెగ్నెన్సీతో ఉంది. అయితే కర్నూల్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగా నిర్థారణ పరీక్ష చేయించుకోవడంతో మూడో ప్రెగ్నెన్సీ కూడా కుమార్తే అని తెలిసింది. ఇలా చేయించుకోవడం తప్పు అని తెలిసినప్పటికి నిబంధనలకు విరుద్ధంగా చేయించుకున్నారు. దీంతో నందికొట్నూరులోని RMP డాక్టర్ గీతారాణి దగ్గరికి వెళ్లి అబార్షన్ చేయించుకున్నారు. అయితే అబార్షన్ చేయించుకున్న రెండు రోజుల తర్వాత ఆమెకు బాగా రక్తస్రావం అయ్యి మృతి చెందింది.
Also Read: దారుణం.. తల్లీ, ఇద్దరు కూతుళ్ల హత్య..
ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన.. ప్రజలలో ఎన్ని మార్పులు వస్తున్న.. కానీ ఆడపిల్లలను హత్య చేయడం మత్రం ఇంకా మానుకోవడం లేదు.. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని కొందరు సంబరపడతారు.. మరి కొందరు అసలు ఆడపిల్ల అంటేనే నచ్చడం లేదు.. నాకు వారసుడు కావాలి అని పట్టుపడతారు.. కాని వాడిని పెంచడానికి తల్లి కావాలి. పెళ్లి చేసుకోవడానికి భార్య కావాలి.. ఆడుకోవడానికి చెల్లెలు లేదా అక్క కావాలి.. కాని కనడానికి మాత్రం కూతురు వద్దు.. ఇలా కూతురుని వద్దు అనుకునేవారు ఎప్పటికి బాగుపడరు.. ఇప్పటికైన కళ్లు తెరిచి ఆడపిల్లలను గౌరవించడం నేర్చుకోండి..