BigTV English
Advertisement

Chiranjeevi : చిరంజీవి డీప్ ఫేక్ వీడియో డిలీట్.. ఫస్ట్ టైం రెస్పాండ్ అయిన మెగాస్టార్..

Chiranjeevi : చిరంజీవి డీప్ ఫేక్ వీడియో డిలీట్.. ఫస్ట్ టైం రెస్పాండ్ అయిన మెగాస్టార్..

Chiranjeevi : స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పేరు ఈమధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవల ఆయన అనుమతి లేకుండా పేరుని ఫోటోలని వాడొద్దు అంటూ కోర్టుకెక్కిన విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కోర్టు చిరంజీవికి అనుకూలంగా తీర్పు చెప్పింది. మెగాస్టార్ ట్యాగ్ని వాడొద్దని, అలాగే ఫోటోలను వాయిస్ నోట్లను అనుమతి లేకుండా అసలు వాడొద్దని తీర్పు ఇచ్చింది. ఒకవేళ కోర్టు తీర్పుని ఉల్లంఘిస్తూ ఎవరైనా వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పుడు చిరంజీవి గురించి మరో చర్చ జరుగుతుంది. చిరంజీవిపై సైబర్‌ నేరగాళ్లు సృష్టించిన డీప్‌ఫేక్‌ వీడియోల వ్యవహారం చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది. వీడియోల గురించి పోలీసులను చిరంజీవి ఆశ్రయించారు. ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. తాజాగా చిరంజీవి డీప్‌ఫేక్‌ వీడియోలను డిలీట్ చేయించినట్లు తెలుస్తుంది. ఆ అకౌంట్లను కూడా బ్లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తుంది..


చిరంజీవి డీప్‌ఫేక్‌ వీడియోలు డిలీట్..

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన అశ్లీల డీప్‌ఫేక్‌ వీడియోలను పోలీసులు తొలగించారు. “దయా చౌదరి” పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియోలను పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఖాతాను ఇప్పటికే బ్లాక్‌ చేయించినట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు . ఈ వీడియోలు ఎక్కడ నుంచి అప్‌లోడ్‌ అయ్యాయో ఆ IP అడ్రస్‌ల ద్వారా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.. ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఇవి విదేశీయుల ఐపీ అడ్రస్లని కనుగొన్నారు. ఈ నేరంలో అంతర్జాతీయ సైబర్‌ గ్యాంగ్‌ ప్రమేయం ఉందని భావిస్తున్నారు.. త్వరలోనే ఎవరక్కడి నుంచి వచ్చాయో పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

డీఫ్ ఫేక్ పై చిరు ఫస్ట్ రియాక్షన్…

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. డీఫ్ ఫేక్ పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన చిరంజీవి.. టెక్నాలజీని మంచి కోసం వాడండి.. వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ బలంగా ఉంది.. ప్రజలు భయపడకండి మీకు ఎప్పుడు పోలీసులు అండగా ఉంటారు అని పోలీసులపై ప్రశంసలు కురిపించారు. డీఫ్ ఫేక్ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లాను.. వీటి గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.. ఈ నేరాలకు అడ్డుకట్టపడేలా ఒక వ్యవస్థని తీసుకురానున్నారు అని చిరంజీవి అన్నారు..


డీప్‌ఫేక్‌ వీడియోలపై అలెర్ట్ అయిన చిరు..

సైన్స్ తో పాటుగా టెక్నాలజీ కూడా పెరుగుతుందని సంతోషించాలో.. వాటిని ఉపయోగించి అవతలి వ్యక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బాధపడాలో అర్థం కానీ పరిస్థితి.. ఈమధ్య ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ( AI ) ద్వారా సెలబ్రిటీల ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి అసభ్య కంటెంట్‌ సృష్టించడం పెరుగుతోంది. ఇప్పటికే ఈ నేరగాల ఉచ్చులో చాలామంది సినీ తారలు చిక్కుకున్నారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రష్మిక మందన్నా, రజినీకాంత్ వంటి పలువురు ఇప్పటికే ఇలాంటి డీప్‌ఫేక్‌ ఘటనలకు బలయ్యారు.. ఇప్పుడు చిరంజీవి కూడా అలానే బాధితుడు అయ్యాడు. డీప్‌ఫేక్‌ వీడియోల విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్ఠ, గౌరవం దెబ్బతినేలా వ్యవహరించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. తనకి వెంటనే న్యాయం చేయాలి అంటూ పోలీసులను కోరాడు. చిరంజీవి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మొత్తానికి ఆ వీడియోలను ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారో తెలుసుకుని తొలగించేశారు. అకౌంట్ ని కూడా డిలీట్ చేశారు..

Also Read :ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. శ్రీవల్లి ఐడియాతో ఇరుక్కున్న టీమ్..రౌడీలను చితక్కోట్టిన ఆడాళ్ళు..

చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు.. వశిష్ట కాంబినేషన్లో విశ్వంభర మూవీలో నటిస్తున్నాడు. అలాగే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంక్రాంతి వస్తున్నాం సినిమా ఫేమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవలే రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది..

 

Related News

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్  ఫైర్ అవుతున్న ఆ హీరో ఫ్యాన్స్.. ఏమైందంటే?

Hyper Aadi: హైపర్‌ ఆది చంపేస్తానంటూ బాలయ్య వార్నింగ్‌.. అసలేం జరిగిందంటే!

Prasanth Varma : డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మకు కోట్ల రూపాయల అడ్వాన్స్… ఫైనల్‌గా ఓపెన్ అయిన నిర్మాత

Salman Khan: దిల్ రాజుతో డీల్ కుదుర్చుకున్న సల్మాన్ ఖాన్..ఆ డైరెక్టర్ తో కొత్త సినిమా?

Abishan Jeevinth: ఘనంగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ వివాహం.. ఫోటోలు వైరల్!

Mass Jathara Business : మాస్ జాతర బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఇన్ని కోట్లు రాబాట్టాల్సిందే

Sambarala Yeti Gattu: సంబరాల ఏటి గట్టు ఆగిపోయిందా.. మళ్లీ ఏమైంది ..?

Pradeep Ranganathan : ‘డ్యూడ్’ హిట్టు.. రెమ్యూనరేషన్‌ పెంచేశాడు.. ఆ హీరోల కంటే ఎక్కువే..

Big Stories

×