 
					Illu Illalu Pillalu Today Episode October 31 st : నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు అతని కోసం టిఫిన్ తెచ్చి ఇస్తాడు. నర్మదా ఆడవాళ్ళు ఇలా భయపడ్డామల్లే మగవాళ్ళు రెచ్చిపోతున్నారు.. ఆ అమ్మాయి నీ ఫ్రెండే కదా.. అమ్మాయిని కాపాడాలని నీకు లేదా ముందు ఆ నెంబర్లు చెప్పు అని అనగానే ఆ అమ్మాయి నెంబర్లు ఇస్తుంది.. బయటికి రాగానే నర్మదా ఒకరికి ఫోన్ చేస్తుంది. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు కదా అని వేదవతి అంటుంది.
అప్పుడే అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో నర్మదా మీ నోరుకొక దణ్ణం తల్లి ఏమంటే అదే జరిగిపోతుంది మీరు కాసేపు నోరు మూసుకొని ఉండండి అని అంటుంది.. చిన్న దొంగతనాలు చేసిన వాళ్లే ఊరు వదిలి పారిపోతున్నారు అలాంటిది ఇంత పెద్ద నేరం చేసిన వాళ్ళు ఫోన్ ఆన్ చేసుకుని ఎలా ఉంటారు అని అడుగుతుంది. ఫోను లాస్ట్ కాల్ లొకేషన్ ని పట్టుకొని మనం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు కదా కానీ ప్రేమ సలహా ఇస్తుంది.. ప్రేమ సలహా విన్న వేదవతి నా కోడలు ఎంత మంచిదో నా మేనకోడలు గ్రేట్ అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. నర్మదను ఆ లొకేషన్ గురించి తెలుసుకోమని అడుగుతుంది. మొత్తానికి ఆ ఇద్దరు లొకేషన్ ని పట్టుకుంటారు.. ఇక్కడ ఏ ఇంట్లో ఉన్నారో చెప్పండి వాన్ని పట్టుకొని వచ్చి లాక్కొచ్చి మరి ఆ అమ్మాయిని తీసుకొస్తాను అని వేదవతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..శ్రీవల్లి మాట వినగానే అందరూ పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తారు.. అయితే నువ్వు ఇప్పుడు బయట ఉన్నావ్ మేము లోపల ఉన్నాము నీ ముద్దుల కోడల్ని తాళం పగల కొట్టి బయటికి తీసుకు రమ్మని అడుగు అని వేదవతితో అంటారు. అవును కదా నేను ఆ పని చేయొచ్చు కదా మీ ముద్దులు కూడా నేనే మరి అని శ్రీవల్లి అంటుంది. ఇక శ్రీవల్లి తాళం పగలగొట్టగానే నా ముద్దుల కోడలు వి నువ్వే అని వేదవతి శ్రీవల్లిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. మీ ముద్దుల ముచ్చట్లు తర్వాత పెట్టుకోవచ్చు ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతుకుదాం పదండి అని అందరూ కలిసి వెతకడానికి వెళ్తారు. ఒకచోట కూర్చుని ఆకలేస్తున్న కాలు నొప్పులు వస్తున్నా వెతుకుతున్నాం కదా ఆయన దొరకట్లేదు ఏంటి అని శ్రీవల్లి అంటుంది.. ప్రేమ ధీరజ్ ఇవాళ అమ్మాయి రాకుండా ఉంటే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అని ఏడుస్తూ ఉంటుంది..
నువ్వెందుకు ఏడుస్తున్నావ్ మేము కష్టపడి నీకోసం వెతుకుతున్నాం కదా ఆకలేస్తున్నా సరే ధీరజ్ కోసం వెతుకుతున్నాం కదా అని శ్రీవల్లి అంటుంది.. ఊరంతా ఇలా జల్లేడు పట్టుకొని వెతికితే అసలు దొరకరు ఏదో ఒక ప్లాన్ వేసి మనం ఉన్న ప్రతి ఇంటిని వెతకాలి అని అనుకుంటారు. వేదవతి పిచ్చిపిచ్చి ఐడియాలను ఇస్తుంది. ఉదయం చేసిన పనులన్నీ ఇప్పుడు చేస్తే మనం అడ్డంగా దొరికిపోతాం.. ఏదైనా ఆలోచించండి చెత్తగా ఆలోచించకండి అంటూ నర్మదా అంటుంది.
శ్రీవల్లి జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళలాగా మనం వెళ్తే కచ్చితంగా ఎవరింట్లో ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది అని ఐడియా ఇస్తుంది. అయితే ఐడియా ని వేదవతి చాలా బాగుంది. నా కోడలు చాలా మంచిది చాలా గొప్పది.. అంటూ పొగడ్తల వర్షం కురిపించి ఫాలో అవుదామని అంటుంది. ఈ ఐడియా నాకు ఎందుకు బెడ్స్ కొట్టేలా కనిపిస్తుంది ఎందుకైనా మంచిది వేరే ఏదైనా ఆలోచిద్దాం అని నర్మదా అంటుంది.. మొత్తానికి డ్రెస్సులు చేంజ్ చేసుకుని జనాభా లెక్కల ప్రకారం వెళ్తారు.. ఇంటికి వెళ్లి జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళ లాగా ఎవరికీ డౌట్ రాకుండా అన్ని ఇల్లు వెతుకుతూ ఉంటారు.
అయితే ఓ ఇంటికి వెళ్ళినప్పుడు అసలైన జనాభా లెక్కలు రాసే వాళ్ళు బయటికి వస్తారు.. మీరెవరు అని అడుగుతారు.. మేము జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళమంటే అవునా అయితే మేము కూడా జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళమే ఇంతకీ మీరు నిజంగానే జనాభా లెక్కలు రాసే వాళ్లే నా అని వాళ్ళు అడుగుతారు.. నర్మదా అడ్డంగా దొరికిపోయినట్టున్నాము.. అక్కడి నుంచి వాళ్లకు దొరకకుండా ఉరుకుతారు. పరిగెత్తి ఒకచోట దాక్కొని మొత్తానికి సేఫ్ అవుతారు..
ఇలాంటి ఐడియా వల్ల నాకు ఆయాసం ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అని వేదవతి అంటుంది. మొత్తానికి బయటకు వచ్చేసి ఆకలేస్తుంది నాకు ఐడియాలు రావట్లేదని శ్రీవల్లి అడుగుతుంది.. ఒక ఫుడ్ ఆర్డర్ చేసే వ్యక్తి వచ్చి ఈ ఫుడ్డు మీదేనా మేడమ్ అని అడుగుతారు శ్రీవల్లి ఆతృతగా మారే మాదే అని తీసుకుంటుంది.. అందరూ కలిసి ఆ ఫుడ్డు మాది కాదు ఎవరు ఆర్డర్ఇచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని పంపిస్తారు. వాళ్లకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు మేడం.. అడ్రస్ కి వెళ్ళినా అక్కడ తప్పు తప్పుగా ఉంది నాకు అర్థం కావట్లేదు అని అతను అంటాడు..
Also Read : అవనిని ఘోరంగా అవమానించిన పల్లవి.. పార్వతి మాటతో అవని హ్యాపీ.. చక్రధర్ కు కొత్త టెన్షన్..
అడ్రస్ తప్పు అంటున్నాడు ఫోన్ కలవట్లేదు అంటున్నాడు కచ్చితంగా ఇది ఆ కిడ్నాప్ పని అయి ఉంటుంది. వాడే ఆకలేసి ఆర్డర్ పెట్టుకున్నాడేమో.. కచ్చితంగా మనం ఫాలో అయితే వాడు దొరుకుతాడని శ్రీవల్లి చెప్తుంది.. అయితే శ్రీవల్లి చెప్పినట్లుగానే ఆ కిడ్నాపర్లు ఒక వ్యక్తి వచ్చి ఆ ఫుడ్ ని తీసుకోబోతుంటాడు అప్పుడే వేదవతి నర్మదా చూసి వాడే వాడిని వెతుక్కుంటూ వెళ్లిపోతారు. వాన్ని వెంబడిస్తూ వెళ్తారు.. వీళ్ళ నుంచి తప్పించుకొని వాడు పరిగెడతాడు.. సినిమా లెవెల్లో అక్కడ సీన్ జరుగుతుంది. శ్రీవల్లి మీద దూకిన వ్యక్తి పోవే పంది అని అంటాడు. నన్నే పంది అంటావని రెచ్చిపోయిన శ్రీవల్లి వాని వెంటపడి వెంటపడి కొడుతుంది. ఇక వాడిని తీసుకొని వెళ్లి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు.. అసలు విషయాన్ని పోలీసులకు చెప్తారు. పోలీసులు ధీరజ్ ని రిలీజ్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..