 
					Mumbai Hostage: ముంబైలో పిల్లలను బందీలుగా తీసుకున్న ఘటనలో నిందితుడు రాకేష్ ఆర్యను ముంబై పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. పోవై ప్రాంతంలో గురువారం ఒక స్టూడియోలో దాదాపు 17 మంది పిల్లలను బందీలుగా తీసుకున్నానని, నిందితుడు వీడియో విడుదల చేసిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి పిల్లలందరినీ రక్షించారు. ఘటనకు ముందు విడుదల చేసిన ఒక వీడియోలో తాను ఉగ్రవాదిని కాదని, తనకు కొందరు వ్యక్తుల నుంచి నైతిక సమాధానాలు మాత్రమే కావాలని డిమాండ్ చేశాడు.
నిందితుడు రాకేష్ ఆర్య కిడ్నాప్ డ్రామాలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైని ఉలిక్కిపడేలా చేసిన కిడ్రాప్ డ్రామా ఒక్కసారిగా ప్లాన్ చేసిందని కాదని, తన సొంత క్రెడిబిలిటి ఉపయోగించి 5 రోజుల పాటు పకడ్బంధీగా రచించిన ప్రణాళిక అని జాతీయ మీడియా నివేదించింది. సోషల్ సర్వీస్‌లో చురుకుగా ఉండే 45 ఏళ్ల ఆర్య, తన ప్రణాళికను అమలు చేయడానికి పోవైలోని ఆర్ఏ స్టూడియోను అనువైన ప్రదేశంగా ఎంచుకున్నాడు.
READ ALSO: UP Crime: పెళ్లి ఆపేందుకు వెళ్లాడు.. ప్రియుడ్ని కట్టేసి చంపేశారు, గొంతు కోసుకున్న ప్రియురాలు
వెబ్ సిరీస్ కోసం పిల్లలు కావాలంటూ ఆడిషన్స్ కోసం ప్రకటన జారీ చేశాడు ఆర్య. గురువారం తాను అనుకున్నట్లే 12 నుంచి 15 ఏళ్ల వయస్సున్న 17మంది పిల్లలు ఆడిషన్స్‌కు వచ్చారు. ఇదే విషయాన్ని స్టూడియో ఉన్న మహావీర్ క్లాసిక్ భవనంలోని సెక్యూరిటీ గార్డు ధృవీకరించాడు. ఆడిషన్స్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, పిల్లలు అంతకంటే ముందే స్టూడియోకి వచ్చారని చెప్పాడు.
ఆర్య చెంబూర్‌లోని ఒక బంధువుల ఫ్లాట్‌లో చాలా రోజులుగా నివసిస్తున్నాడు. ఆర్య పిల్లలను హోస్టేజ్‌లను తీసుకోవడానికి ముందు వీడియోను రికార్డు చేసుకున్నాడు. తన ఆపరేషన్ మొదలైన తరువాత మీడియా సంస్థలకు వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలో, తాను ఉద్దేశపూర్వకంగానే పిల్లలను హోస్టేజ్ లుగా తీసుకున్నానని స్పష్టంగా పేర్కొన్నాడు. “ఆత్మహత్య ద్వారా చనిపోవడానికి బదులుగా, నేను కొంతమంది పిల్లలను బందీలుగా ఉంచాను” అని వీడియోలో తెలిపాడు. తనతో చర్చలు మాత్రమే జరుపాలని, అధికారులు జోక్యం చేసుకుంటే స్టూడియోను తగలబెడతానని బెదిరించాడు.
అప్సిరా మీడియా కంపెనీ యజమాని అయిన ఆర్య దాదాపు రెండు గంటల పాటు చర్చలతో సహకరించడానికి నిరాకరించాడని పోలీసు అధికారులు ధృవీకరించారు. ఒక బందీగా ఉన్న అమ్మాయి మూర్ఛతో బాధపడుతుందని తల్లిదండ్రులు చేసిన అప్పీల్ కూడా అతన్ని ఒప్పించలేకపోయింది. చర్చల సమయంలో అతను ప్రశాంతంగా కనిపించాడని, చివరి వరకు పరిస్థితిని అదుపులో ఉంచుకున్నాడని ఒక అధికారి పేర్కొన్నారు.
రెండు గంటల చర్చల ప్రయత్నం తరువాత పోలీస్ కమాండో బృందం స్టూడియోలోకి చొరబడిన తర్వాతే ముట్టడి ముగిసింది. ఆర్య మొదట ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం కమాండోలు తిరిగి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. తరువాత ఆర్య ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. ఆర్య ఒక సోషల్ సర్వీస్ ఎంటర్ ప్రెన్యూర్. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ముంబైలోని ఐఎస్బీ పూర్వ విద్యార్థి అయిన ఆర్య, ప్రభుత్వ కార్యక్రమాలలో నటులతో కలిసి పనిచేసినట్లుగా తెలుస్తోంది.