E-Paper
Advertisement

Sushanth Singh: సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య.. ఆ ఇద్దరే చేశారంటూ సోదరి కామెంట్స్!

Sushanth Singh: సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య.. ఆ ఇద్దరే చేశారంటూ సోదరి కామెంట్స్!
Advertisement

Sushanth Singh:సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) తన అసాధారణమైన నటనా ప్రతిభతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయిన ఈయనను చూసి కొంతమంది ఓర్వలేక అవకాశాలు రాకుండా చేశారనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే అనూహ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఈయన మరణాన్ని సినీ అభిమానులు, సెలబ్రిటీలే కాదు.. సినీ ఇండస్ట్రీ కూడా ఓర్వలేకపోయింది.

సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య..

ఈ కేసులో ఎంతోమంది ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈయన ప్రేయసి రియా చక్రవర్తి జైలు జీవితం కూడా గడిపింది. ఇటీవల ఈ కేసుకి.. ఈయనకు సంబంధం లేదని కోరుతూ కొట్టివేయడంతో ఇటీవలే ఆమె తన సోదరుడితో కలిసి బిజినెస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి స్పందించింది. తన సోదరుడిది ఆత్మహత్య కాదని.. హత్య అని.. చేసింది కూడా ఆ ఇద్దరే అంటూ ఊహించని కామెంట్లు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయం చెప్పిన సుశాంత్ సోదరి..

Advertisement

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై ఆయన సోదరి శ్వేతా సింగ్ మాట్లాడుతూ ఊహించని కామెంట్లు చేశారు. తాజాగా ఆమె జర్నలిస్టు శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” సుశాంత్ మరణం ఆత్మహత్య కాదు.. ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అమెరికా, ముంబై కి చెందిన ఇద్దరు మానసిక నిపుణులు నాతో ఈ విషయం తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడం శారీరకంగా సాధ్యం కాదని.. ఎందుకంటే ఫ్యాను, బెడ్ మధ్య కాలు వేలాడదీయడానికి తగినంత దూరం లేదని, కాబట్టి ఎవరో హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది శ్వేతా సింగ్. ప్రస్తుతం ఈ విషయాలు విని అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ALSO READ:Chiranjeevi Deep Fake Case : చిరంజీవి డీప్ ఫేక్ కేస్… టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సస్పెండ్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కెరియర్..

Advertisement

1986 జనవరి 21 సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జన్మించారు. హిందీ సినీ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన సినిమా రంగంలోకి రాకముందు టెలివిజన్ సీరియల్స్ తో కెరియర్ ఆరంభించారు. అలా 2008లో స్టార్ ప్లస్ లో వచ్చిన కిస్ దేశ్ మెయి హై మేరా దిల్ అనే సీరియల్ లో తొలిసారి నటించారు. ఆ తర్వాత జీ టీవీ సీరియల్ పవిత్ర రిష్టలో 2009 నుండి 2011 వరకు ప్రసారమైన ఈ సీరియల్ లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. 36 సంవత్సరాల వయసులోనే తనువు చాలించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×