 
					Gambhir- Jemimah: స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ {ICC WOMEN’S WORLD CUP} 2025 మెగా టోర్నీలో టీమిండియా ఫైనల్ కి చేరింది. గురువారం రోజు జరిగిన సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సెమీఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆ లక్ష్యాన్ని టీం ఇండియా చేదించింది. ఏడుసార్లు ఛాంపియన్ గా నిలిచిన బలమైన ఆస్ట్రేలియా జట్టును సెమీఫైనల్ లో ఏకంగా ఐదు వికెట్ల తేడాతో మట్టి కరిపించి ఫైనల్ చేరింది టీమిండియా.
Also Read: KL Rahul: ఐపీఎల్ 2026 కంటే ముందే కేఎల్ రాహుల్ కు రూ.25 కోట్ల ఆఫర్ ?
భారత బ్యాటింగ్ లో జమీమా రోడ్రిగ్స్ సెంచరీ {127}, కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ {89}, చివర్లో దీప్తి శర్మ, రీచా ఘోష్ మెరుపులు మెరూపించడంతో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సెమీఫైనల్ లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న జమీమా దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది. 48.3 ఓవర్ల లోనే టీం ఇండియాని విజయతీరాలకు చేర్చి.. ఫైనల్స్ లోకి తీసుకువెళ్లింది జమీమా. ఇక ఈ మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసింది. ఆ సమయంలో జమీమా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ సెమీఫైనల్ మ్యాచ్ కి ముందు వరుసగా విఫలమవుతున్న జమీమాను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ వీటన్నింటిని తట్టుకొని మరి సెమీఫైనల్ లో అద్భుతంగా రాణించింది.
జెమీమాకి ఇది తొలి ప్రపంచకప్ సెంచరీ. ఈ మ్యాచ్ అనంతరం జమీమా భావోద్వేగానికి గురై మాట్లాడుతూ.. ” నేను దీన్ని ఒంటరిగా చేయలేకపోయే దాన్ని. దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను. నా తల్లిదండ్రులు, కోచ్, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు గత నెల చాలా కష్టంగా గడిచింది. కానీ ఇప్పుడు ఇది నాకు ఒక కలలా అనిపిస్తుంది. ఇప్పటికీ ఇది కలో.. నిజమో తెలియట్లేదు. ఈ మ్యాచ్ లో నేను మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయబోతున్నానని కూడా నాకు తెలియదు. ఐదు నిమిషాల ముందు మాత్రమే నాకు సమాచారం ఇచ్చారు. చివర్లో నేను అలసిపోయినా.. దీప్తి ప్రతి బంతికి నన్ను ఉత్సాహపరిచింది. జట్టు సహకారం లేకుండా నేను ఏం చేయలేను.” అంటూ బోరున ఏడ్చేసింది.
జమీమాని ప్రస్తుతం నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా గౌతమ్ గంభీర్ తో పోలిస్తున్నారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో మూడవ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన గౌతమ్ గంభీర్.. శ్రీలంకపై 97 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జెమీమా సైతం మూడవ స్థానంలోనే బ్యాటింగ్ కి దిగింది. అంతేకాకుండా వీరిద్దరి జెర్సీ నెంబర్ {5} కూడా ఒకటే కావడం విశేషం. ఇక వీరిద్దరూ ధరించిన జెర్సీలకు ఒకే చోటా మరకలు ఉండడంతో.. వీరిద్దరి ఫోటోలను నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు.
Gautam Gambhir 🤝 Jemimah Rodrigues 💙
Different eras, same grit. Same stage, same pressure — and both stood tall when India needed a hero the most. 🙌
Gambhir in the 2011 World Cup Final.
Jemimah in the 2025 Women’s World Cup Semi-Final.
Two innings etched in Indian cricket… pic.twitter.com/oq6xKnGi44— SportsTiger (@The_SportsTiger) October 30, 2025