Tollywood: ఈ మధ్యకాలంలో చాలామంది సినిమాల ద్వారా ఒక గుర్తింపును సొంతం చేసుకుని, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ లో కూడా చాలామంది హీరోలు సొంతంగా పార్టీలు పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. మరికొంతమంది లీడింగ్ పార్టీలలోకి చేరుతూ తమ రాజకీయ జీవితానికి పునాదులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అటు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నారా రోహిత్ (Nara Rohit) కూడా ఇప్పుడు తమ కుటుంబ సభ్యుల సలహా మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు సమాచారం.
రాజకీయ ఎంట్రీ పై ఉత్సుకత చూపిస్తున్న నారా రోహిత్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu), తమ్ముడు దివంగత రాజకీయ నేత రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ హీరో రోహిత్ ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా చంద్రగిరిపై ప్రత్యేక దృష్టి సారించారు నారా రోహిత్. ఇక ఈయన రాజకీయ ఉత్సుకతపై చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పెదనాన్న చంద్రబాబు, అన్నయ్య లోకేష్ తో రోహిత్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారి ప్రోత్సాహంతో ఇప్పుడు చంద్రగిరి లో పాగా వెయ్యడానికి సిద్ధమవుతున్నారు నారా రోహిత్.
తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్న రోహిత్..
అసలు విషయంలోకి వెళ్తే .. 1994 – 99 మధ్య రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో మాజీ మంత్రి గల్లా అరుణపై ఆయన గెలుపొందారు. ఇప్పుడు తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని రోహిత్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట రోహిత్. నిజానికి ఇంకా ఎన్నికలకు నాలుగు సంవత్సరాల సమయం ఉంది. అయితే ఇప్పటినుంచే ఎక్కడా బయటపడకుండా రహస్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
అదే సాకుతో రాజకీయ ఎంట్రీ..
ముఖ్యంగా చంద్రగిరి నుంచి నారావారి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అనే బలమైన అభిప్రాయంతో లోకేష్ ఉన్నారని సమాచారం. ఎందుకంటే చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారి పల్లె. పైగా స్వస్థలంలో టీడీపీ, పైగా నారావారి కుటుంబం బలమైన పట్టు సాధించకపోవడంతో తండ్రీ కొడుకు (చంద్రబాబు, లోకేష్) లు ఇద్దరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు 2024 ఎన్నికల్లో కూడా కూటమి కారణంగానే టిడిపి గెలుపొందింది అని ప్రజలు కూడా చెబుతున్నారు. ఎందుకంటే చంద్రగిరి వైసీపీకి కంచుకోటగా మారింది. అందుకే ఎలాగైనా సరే చంద్రగిరిలో పాగా వేయడానికి రోహిత్ తనదైన రీతిలో అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదే సాకుతో రాజకీయ ఎంట్రీ ఇస్తున్న రోహిత్ ను ప్రజలు ఏ మేరకు అందలం ఎక్కిస్తారు అనేది చూడాలి. ఇక ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈయన.. రాజకీయ రంగంలోకి అడుగుపెడితే అక్కడ ఏ మేరకు ప్రజల ఆశీస్సులు, మన్ననలు పొందుతారో చూడాలి.
ALSO READ: Hollywood star: ఇండియాలో రోడ్ సైడ్ ఇడ్లీలు తింటూ కెమెరా కంటికి చిక్కిన హాలీవుడ్ నటుడు.. ఎవరంటే?