Hollywood star..సడన్ గా మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా పని మీద ఎటైనా బయటికి వెళ్లినప్పుడు ఏదైనా చూడకూడని సంఘటన చూస్తే ఎలా ఎగ్జైట్ అవుతామో మాటల్లో చెప్పలేము.ముఖ్యంగా మనకు ఇష్టమైన వాళ్లు లేదా అభిమాన నటీనటులు ఎవరైనా ఎదురైతే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయికి సడన్ గా ఏకంగా హాలీవుడ్ నటుడే కనిపించాడు.. హాలీవుడ్ నటుడు(Hollywood Hero) అంటే ఎంత పెద్ద హీరోనో చెప్పనక్కర్లేదు. అలాంటి హీరోని కళ్ళ ముందు చూస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది.మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..? ఆమెకు కనిపించిన ఆ హాలీవుడ్ నటుడు ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..
రోడ్డు సైడ్ ఇడ్లీలు తింటూ కనిపించిన హాలీవుడ్ నటుడు..
చాలామంది సెలబ్రిటీలు రోడ్లపై ఎక్కువగా కనిపించరు. ఏదో సినిమా షూటింగ్ లకు లేక ఎప్పుడో ఒకసారి తప్ప మిగతా సమయాల్లో రోడ్లపైన కనిపించరు. ఎందుకంటే రద్దీగా ఉండే ప్రదేశాల్లో కనిపిస్తే అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడతారు. అందుకే చాలామంది సెలబ్రిటీలు బయట ఎక్కువగా రోడ్లమీద కనిపించరు.కానీ ఈ హాలీవుడ్ నటుడు మాత్రం ఏకంగా ఇండియాలోని రోడ్ సైడ్ ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీలు తింటూ కనిపించాడు.
దక్షిణ భారతదేశ బ్రేక్ఫాస్ట్ రుచి చూసిన హాలీవుడ్ నటుడు..
మరి ఇంతకీ ఆయన ఎవరు అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game Of Thrones) అనే మూవీలో జైన్ లన్నిస్టర్ పాత్ర ద్వారా ఫేమస్ అయినటువంటి హాలీవుడ్ నటుడు నికోలాజ్ కోస్టర్ వాల్డౌ(Nikolaj Coster Waldau). తాజాగా నికోలాజ్ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) లో సాంప్రదాయ దక్షిణ భారతదేశ బ్రేక్ఫాస్ట్ అయినటువంటి ఇడ్లీ తింటూ కనిపించాడు.అయితే ఈ విషయాన్ని ఆయన్ని చూసి ఎగ్జైట్ అయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పంచుకుంది.. ఆమె తన వీడియోలో నికోలాజ్ ని చిత్రీకరించింది. అయితే హాలీవుడ్ నటుడు అయినా కూడా ఆ హీరో చాలా సాధారణ వాళ్లలాగే జీన్స్,టీ షర్టు ధరించి తన ఫ్రెండ్స్ తో కలిసి ఇడ్లీ తింటూ ఉన్నాడు.. ఈ వీడియోని చిత్రీకరించిన ఆ అమ్మాయి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో షేర్ చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని..
ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది.ఈరోజు నేను గేమ్ ఆఫ్ త్రోన్ సినిమా ద్వారా ఫేమస్ అయిన జైమ్ లన్నిస్టర్ పాత్రలో చేసిన నికోలాజ్ ని ఇడ్లీ బండి దగ్గర కలిశాను. నేను మామూలుగా @therameshwaramcafe లో నన్ను నేను వీడియో తీస్తూ ఉండగా సడన్గా ఆయన్ని గుర్తించాను. అంటూ తెలిపింది. ఇక ఆ అమ్మాయి షేర్ చేసిన వీడియోలో హాలీవుడ్ నటుడు నికోలాజ్ తన స్నేహితులతో కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. అక్కడే ఇడ్లీ,దోశ,వడ వంటి ఆహార పదార్థాలను కూడా తింటున్నారు. ప్రస్తుతం ఆ హాలీవుడ్ స్టార్ కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు హీరో అని ఏమాత్రం గర్వం లేకుండా మామూలు వారిలాగే వచ్చి రోడ్ సైడ్ ఇడ్లీలు తింటున్నారు అంటూ ఆయన సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. ఇక నికోలాజ్ ఇండియా (India) ని సందర్శించడం కోసం వచ్చినట్టు తెలుస్తోంది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==