BigTV English

Hero Siddarth: సొంత ఇల్లు లేదు.. తెలంగాణ అల్లుడిని కదా అంటూ సిద్ధార్థ్ ఎమోషనల్!

Hero Siddarth: సొంత ఇల్లు లేదు.. తెలంగాణ అల్లుడిని కదా అంటూ సిద్ధార్థ్ ఎమోషనల్!

Hero Siddarth: ప్రముఖ కోలీవుడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్ (Siddarth) తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. సరైన సక్సెస్ లభించలేదు. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈయన తాజాగా ‘3 BHK’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సిద్ధార్థ్ కెరియర్లో 40వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి జూన్ 27న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా. ఈ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు సిద్ధార్థ్ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇదే ఈవెంట్లో 25 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేదని అయితే ఇప్పుడు తెలంగాణ అల్లుడిని కావడంతో ఆ బాధ్యతలు మరింత పెరిగాయి అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు.


సొంతింటి కలపై సిద్ధార్థ్ ఎమోషనల్ కామెంట్స్..

3 BHK ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలవుతోంది. నా జీవితంలో సగ జీవితానికి పైగా సినిమాలలోనే గడుపుతున్నాను. ప్రస్తుతం సంతోషంగా జీవితం ముందుకు సాగుతోంది. కానీ ఇప్పటివరకు నేను ఒక్క ప్రాపర్టీ కూడా కొనలేదు. సొంత ఇల్లు లేదు. కనీసం ల్యాండ్ కూడా నేను కొనుగోలు చేయలేదు. కానీ ఫస్ట్ టైం 3BHK సినిమా చేస్తున్నప్పుడు రెండు నెలల క్రితం ఒక ఇంటిని కొనుగోలు చేశాను. ఎందుకంటే ఇప్పుడు నేను తెలంగాణ అల్లుడిని కదా అందుకే బాధ్యతలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఆ బాధ్యతల కారణంగానే సొంత ఇల్లు కొనుగోలు చేయాల్సి వచ్చింది” అంటూ సిద్ధార్థ్ తెలిపారు.


ఆమె నా జీవితంలోకి రావడం అదృష్టం..

సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “నా భార్య నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆమెతో వివాహం జరిగిన తర్వాతనే మేమిద్దరం కలిసి కలలు కన్నాము. మాకంటూ ఒక ఇంటి పేరు ఉండాలి.. దానిపైన ఒక సొంత ఇల్లు ఉండాలి అని.. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఇప్పుడు అది జరిగిపోయింది. ఇక అందరూ అంటారు కదా ” ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు” అని.. అయితే అందరూ అనుకుంటున్నట్టు అన్ని మన చేతుల్లో ఉండవు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అది అనుకోకుండానే జరిగిపోతుంది” అంటూ తెలిపారు హీరో సిద్ధార్థ్. మొత్తానికైతే సొంత ఇంటి కల తన భార్య అదితి రావు హైదరి తన జీవితంలోకి వచ్చిన తర్వాతనే నెరవేరింది అని.. తెలంగాణ అల్లుడిగా మారిన తర్వాత బాధ్యతలు మరింత పెరిగాయి అని చెప్పుకొచ్చారు సిద్ధార్థ్.

సిద్ధార్థ్ వ్యక్తిగత జీవితం..

సిద్ధార్థ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘన (Meghana)ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. కానీ విభేదాలు రావడంతో 2007లో విడిపోయారు. ఇక ఇప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ఈయన.. 2024 మార్చి 27న ప్రముఖ హీరోయిన్ అదితీ రావు హైదరి(Aditi Rao hydari) ని kudaa ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. వీరు వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లోని రంగనాథ్ స్వామి ఆలయంలో వివాహం చేసుకోవడం జరిగింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో వీరు వివాహం చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

also read:Kannappa: కన్నప్ప టీమ్ కి భారీ షాక్.. ఆన్లైన్ లో హెచ్డీ ప్రింట్ లీక్!

Related News

Kriti sanon: ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన ప్రభాస్ బ్యూటీ…ధర ఎంతంటే?

Bose-The Mystery Unsolved Trailer: నేతాజీ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే..

Raj Kundra: స్వామీజీకి కిడ్నీ దానం చేస్తానన్న నటి భర్త.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Kishkindhapuri Teaser: నమస్కారం.. ఈ రోజు శుక్రవారం.. భయపెడుతున్న’కిష్కంధపురి’ టీజర్‌

Sir Madam OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సార్ మేడమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Alia Bhatt: ఇదేమైనా మీ ఇల్లు అనుకున్నారా… ఫోటోగ్రాఫర్ల పై ఫైర్ అయిన అలియా!

Big Stories

×