Actress Nidhi Aggarwal: నిధి అగర్వాల్ (Nidhi Aggarwal)ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు నార్త్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. సవ్యసాచి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ఈమె అనంతరం తెలుగులో మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో వంటి సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటించిన ది రాజా సాబ్(The Raja Saab) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావటం విశేషం.
పాన్ ఇండియా హీరోతో ఛాన్స్..
ఇప్పటివరకు తెలుగులో చిన్న హీరోలతో కలిసి నటించిన నిధి అగర్వాల్ ఒకేసారి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన అలాగే పవన్ కళ్యాణ్ సరసన నటించడంతో ఈ రెండు సినిమాలు కూడా తన కెరియర్ కు ఎంతో కీలకమని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తనకున్నటువంటి ఒక వింత అలవాటు గురించి తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మర్డర్ మిస్టరీ సినిమాలు..
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిధి అగర్వాల్ తాజాగా ఒక పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా “ప్రతిరోజు రాత్రి నాకు ఒక మర్డర్ మిస్టరీ సినిమా లేదా వెబ్ సిరీస్ చూసే అలవాటు వచ్చింది. ప్రస్తుతం నాకు కొత్త కంటెంట్ ఎక్కడ దొరకడం లేదు. దయచేసి నాకు మంచి మర్డర్ మిస్టరీ ఉన్న కంటెంట్ గురించి తెలియజేయండి.. భాష ఏదైనా పరవాలేదు” అంటూ ఈమె చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఈ పోస్టుపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. రాత్రిపూట పడుకోవడానికి ముందు ఇలాంటి మర్డర్ మిస్టరీ సినిమాలు చూసే అలవాటు ఉండటం ఏంటి దెయ్యంలాగా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
హరిహర వీరుమల్లు..
నిధి అగర్వాల్ చూడటానికి చాలా సైలెంట్ గా క్యూట్ గా కనిపిస్తారు కానీ ఈమెకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఏదైనా హర్రర్ థ్రిల్లర్ లేదా మర్డర్ మిస్టరీ సినిమాలు చూస్తే ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు కానీ ఈమె ప్రతిరోజు అలాంటివి చూసి పడుకుంటారని తెలియడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇక నిధి సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో ఈమె ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారని ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా భరతనాట్యంతో పాటు హార్స్ రైడింగ్ వంటివి కూడా నేర్చుకున్నాను అని ఇటీవల నిధి అగర్వాల్ వెల్లడించారు.
Also Read: పేరు మార్చుకున్న మీనాక్షి చౌదరి.. మీరు కూడా ఆ టైపేనా?