Tollywood: ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం హీరోల పక్కన నటించడానికి మాత్రమే తీసుకునేవారు అనే అపోహలు ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ యాక్షన్ చిత్రాలలో చేయడానికి కూడా వెనుకాడడం లేదు. జానర్ ఏదైనా సరే తమ స్ట్రాటజీ ఏంటో నిరూపించగలం అంటూ.. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి చేత ఔరా అనిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ రొమాన్స్ చేయడానికి కాదు రంగంలోకి దిగడానికి కూడా సిద్ధమని ఇప్పుడు చాలామంది నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే రొమాన్స్ పాత్రలను పక్కన పెట్టేసి హారర్ జానర్ కి ఓటేస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఈ జానర్ లో సినిమా చేయడానికి ముందుకొచ్చింది. ఆమె ఎవరో కాదు యామీ గౌతమ్ (Yami Goutham). నిన్న మొన్నటి వరకు ఆర్టికల్ 370, OMG2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన యామీ గౌతమ్.. త్వరలో ‘హక్’ అనే చిత్రంతో తెరపైకి రాబోతోంది. ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ‘నయీ నవేలి’ అని సినిమాను రూపొందిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్గా యామీ గౌతమ్ ని ఎంపిక చేసుకున్నారట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇది కామెడీ హారర్ చిత్రం కావడం గమనార్హం.
విషయంలోకి వెళ్తే.. భారతీయ జానపద కథలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్న హారర్ కామెడీ మూవీ. ముందుగా ఇందులో కృతి సనన్ (Kriti Sanon ) ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆమె స్థానంలో యామీ గౌతమ్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ఏడాది ఆఖరిలో సెట్ పైకి వెళ్ళనుంది అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే ఇందులో యామి గౌతమ్ తొలిసారి హారర్ జానర్ లోకి అడుగు పెట్టబోతోంది. మరి ఈ జానర్ ఈమెకు ఏ విధంగా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
ఇకపోతే ఇలా హారర్ కామెడీకి ఓటేస్తున్న హీరోయిన్ ఈమె మాత్రమే కాదు. ఇప్పటికే రష్మిక మందన్న (Rashmika Mandanna), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) వంటి యంగ్ హీరోయిన్లు కూడా ఇలా కామెడీ హారర్ జానర్లో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే అనుపమ పరమేశ్వరన్ కూడా ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా వచ్చిన ‘కిష్కింధపురి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో హారర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.
ALSO READ:Kalki 2: కర్ణ 3102 బీసీలో మొదటి ప్రాముఖ్యత ఎవరికి.. క్రేజీ న్యూస్ వైరల్!
ఇప్పుడు రష్మిక వంతు.. థామా అనే బాలీవుడ్ చిత్రంలో హారర్ జానర్ లో నటిస్తోంది. ఈ సినిమాపై కూడా ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా యంగ్ హీరోయిన్లు అందరూ కూడా రొమాన్స్ చిత్రాలను పక్కనపెట్టి హారర్ జానర్, కథ ఓరియంటెడ్ చిత్రాలకు ఓటు వేస్తూ సత్తాచాటుతూ దూసుకుపోతున్నారు. మరి వీరందరికీ ఈ సినిమాలు ఏ విధంగా వర్కౌట్ అవుతాయో చూడాలి.