SS Thaman With Sachin Tendulker: ఎస్ఎస్ తమన్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తన సంగీతం సౌత్ ఆడియన్స్‌ని ఉర్రతలూగిస్తున్నాడు. తమన్ సంగీతం అంటే థియేటర్లలో దబిడిదిబిడే అంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ రాణిస్తున్నాడు. సినిమాలతో ఎంత బిజీ ఉన్న సోషల్ మీడియా మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంటాడు. అంతేకాదు మూవీ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంటాడు.
అయితే తాజాగా తమన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అమెరికా నుంచి ఇండియా వస్తున్న తమన్.. ఫ్లైయిట్లో ప్రముఖ వ్యక్తిని కలుసుకున్నానంటూ ఫోటో తో సర్ప్రైజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన ఆనంద క్షణాలను ట్విటర్ వేదిక షేర్ చేసుకున్నాడు అంతేకాదు చివరిలో ఓ హింట్ కూడా ఇచ్చాడు. దీంతో తమన్ ట్వీట్ అంతర్యం ఏంటా నెటిజన్స్ ఆలోచనలో పడ్డారు. ఇంతకి ఆ స్పషల్ పర్సన్ మరెవరో కాదు ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్. డల్లాస్ నుంచి దుబాయ్ వరకు సచిన్తో కలిసి ట్రావెల్ చేసినట్టు తన పోస్ట్లో చెప్పుకొచ్చాడు. అంతేకాదు త్వరలోనే ఆయనతో కలిసి వర్క్ చేస్తా అంటూ చెప్పి అందరిలో ఆలోచనలో పడేసాడు.
ఇంతకి తమన్ తన పోస్ట్లో ఏం చెప్పాడంటే.. “గాడ్ ఆఫ్ క్రికెట్, ది లెజెండ్ సచిన్తో కలిసి డల్లాస్ నుంచి దుబాయ్ వరకు ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మేమిద్దరం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో(CCL) నేను ఆడియన క్లిప్స్ని ఆయనకు చూపించాను. నీ బ్యాటింగ్ స్పీడ్ సూపర్ అని మాస్టర్ కితాబిచ్చారు” అంటూ తమన్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఇక చివరిలో త్వరలోనే ఆయనతో కలిసి పని చేయొచ్చు కూడా అని హింట్ ఇచ్చి అందరిలో క్యూరియాసిటీ పెంచాడు. ప్రస్తుతం తమన్ పోస్ట్ నెట్టింట్ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట సంబరాలు.. మరోసారి తండ్రైన ఆర్భాజ్ ఖాన్!
క్రికెట్ గాడ్ సచిన్తో కలిసి తమన్ పనిచేయడం ఏంటి? అంటే సచిన్ సినిమాల్లో నటించనున్నారా? లేదా కలిసి గ్రౌండ్ సచిన్తో కలిసి బ్యాటింగ్కి దిగుతాడా? దీని అంతర్యం ఏంటి తమన్ భయ్యా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తమన్ ప్రస్తుతం ‘అఖండ 2′తో పాటు మరిన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. తమన్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు మంచి క్రికెట్ ఆటగాడు అనే విషయం తెలిసిందే. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తనదైన ఆటతో మెరుపు ఇన్నింగ్స్ ఇస్తాడు. సిక్స్లు, ఫ్లోర్లు బాది స్కోర్ భారీ దిశగా తీసుకువెళ్తాడు. అతడి బ్యాటింగ్ సూపర్ అంటూ సినీ ప్రముఖులు సైతం ప్రశంసిస్తుంటారు.
Traveling with God of Cricket 🏏 the Legend @sachin_rt ❤️🤌🏽
Had some lovely time all the way from dallas to Dubai
Showed him the @ccl matches clips of mine batting .
The master said u have a great bat Speed 💨💨💨
Uhffffffff Sorted 📈📈📈📈📈Might work with him soon 🫧🙌🏿… pic.twitter.com/FxKd6Ddx4L
— thaman S (@MusicThaman) October 6, 2025