Harmanpreet Kaur: వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( Womens World Cup 2025 ) నేపథ్యంలో టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కీలక పోరులో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఏకంగా 88 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో పాకిస్తాన్ మట్టి కరిచింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur ) ను టార్గెట్ చేసింది పాకిస్తాన్ స్పిన్నర్ నష్రా సంధు ( Nashra Sandhu ). బౌలింగ్ చేసిన అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ ను బెదిరించే ప్రయత్నం చేసింది. అయితే వెంటనే కౌంటర్ ఇచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్, బండ బూతులు తిట్టింది. బోస్*** అంటూ ఊర మాస్ రేంజ్ లో రెచ్చిపోయింది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. కుక్కలాగా చూస్తున్నావు అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ లో కీలక సంఘటనలు జరిగాయి. ఇండియా టాస్ గెలిచినప్పటికీ పాకిస్తాన్ గెలిచినట్లుగా రిఫరీ తప్పిదం చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ మధ్యలో కొన్ని పురుగులు రావడంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఇక లేటెస్ట్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ వర్సెస్ పాకిస్తాన్ స్పిన్నర్ నష్రా సంధు ( Nashra Sandhu ) మధ్య వార్ సంఘటన బయటపడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్ వేసేందుకు నష్రా సంధు వచ్చారు.
అయితే అద్భుతంగా బౌలింగ్ వేసిన నష్రా సంధు ( Nashra Sandhu ), కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ను చూస్తూ ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. కండ్లు పెద్దగా చేసి మరీ బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే దానికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. పోవే పో అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు. హిందీలో చెప్పడానికి బూతులు తిట్టారు హర్మన్ ప్రీత్ సింగ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే వీళ్ళిద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ లో కూడా షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతోంది. భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్లేయర్లు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. పాకిస్తాన్ తో మ్యాచ్ నిర్వహిస్తే అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు కానీ… పాకిస్తాన్ ప్లేయర్లకు మాత్రం షేక్ అండ్ ఇవ్వలేం లేదు టీమిండియా ప్లేయర్లు.
Harmanpreet Kaur 😭🔥#WomensWorldCup2025 pic.twitter.com/UJN8PIhdPe
— Shilpa (@shilpa_cn) October 5, 2025