Nagarjuna 100 Movie : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు నాగార్జున (Nagarjuna). ఈ మధ్యకాలంలో ఈయన తోటి హీరోలు బాలకృష్ణ (Balakrishna), చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్ (Venkatesh).వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. హీరోలుగా బ్లాక్ బాస్టర్ విజయాలను దక్కించుకుంటుంటే.. నాగార్జున మాత్రం హీరోగా సినిమాలు చేయడం లేదు. దీంతో అభిమానులలోనే కాదు సినీ లవర్స్ లో కూడా నిరాశ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నాగార్జున హీరోగా సినిమాలు చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతోనే సరిపెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల వచ్చిన కుబేర , కూలీ వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. దీనికి తోడు బిగ్ బాస్ (Bigg Boss) వంటి షోలకి హోస్ట్గా వ్యవహరిస్తూ కాలం వెల్లదీస్తున్నారు.
అందుకే నాగార్జున హీరోగా సినిమా ఎప్పుడు ప్రకటిస్తారు? అంటూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. తన 100 సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఊహించని అప్డేట్ తెరపైకి వచ్చింది. పైగా తన 100వ సినిమాతో ఎలాగైనా రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు నాగార్జున. అందులో భాగంగానే ఒక మంచి కథ కోసం ఇన్ని రోజులు ఎదురు చూశారట. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ‘లాటరీ కింగ్’ అనే పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని.. అన్నపూర్ణ బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
ALSO READ:Karan Johar: అత్యంత ధనిక దర్శకుడిగా కరణ్.. ఎన్ని వేల కోట్లో తెలిస్తే షాక్!
ఈ సినిమాలో నాగార్జున సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్, మాస్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ కలిపి అభిమానులు మెచ్చేలా.. ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇకపోతే గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగార్జున.. ఈ 100వ సినిమా కోసం ప్రత్యేకంగా రెడీ అవుతుండడం.. పైగా తన సొంత బ్యానర్ తోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడంతో పంచనాలు కూడా పెరిగిపోయాయి.
ఇకపోతే ఈ సినిమాకి లాటరీ కింగ్ అని టైటిల్ పెట్టబోతున్నారని వార్తలు రావడంతో.. అప్పుడే అభిమానులలో కూడా సరికొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లాటరీ కింగ్ అని టైటిల్ పెట్టడం కాదు.. లాటరీ కొట్టడం అంటే 100 కోట్ల క్లబ్లో చేరిపోవడం.. మరి ఈ 100వ సినిమాతో అయినా నాగార్జున ఆ ఫీట్ అందుకుంటాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ 100వ సినిమాతో వంద కోట్లు కొట్టాలని.. అందుకే టైటిల్ ఇలా పెట్టారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని విషయాలలో స్వయంగా దగ్గరుండి మరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాగార్జునకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇందులో నాగార్జున వారసులు నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil) ఇద్దరు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. మరి కొడుకులతో భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున తన కలను నెరవేర్చుకుంటారో లేదో చూడాలి.