This week OTT Movies : ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆగస్టు నెలలో అనుకున్న విధంగా ఏ సినిమా హిట్ అవ్వలేకపోయింది. ఇంక సెప్టెంబర్ నెల నుంచి కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి అందులో ఈమధ్య వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా పర్వాలేదు అనిపించింది.. అలాగే ఓజీ, రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1 కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈనెల చివరన రాబోతున్న సినిమాలు కాస్త ఆసక్తిగా ఉన్నాయి.. ముఖ్యంగా తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ, టాలీవుడ్ క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు మూవీ లవర్స్. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..
అదేవిధంగా ఓటీటీలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ ఓటిటి లోకి రాబోతున్న విషయం తెలిసిందే. తేజ సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ మిరాయ్ కూడా ఈ వారమే ఓటీటీలో సందడి చేయనుంది. పలు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. యాక్షన్ థ్రిల్లర్ నుంచి మైథాలజికల్ డ్రామా వరకు ప్రేక్షకులకు పలు ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వార్ 2.. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.. కలెక్షన్ పరంగా మంచి వసూలని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లోకి అక్టోబర్ 9 న స్ట్రీమింగ్ కాబోతుంది.
తెలుగు నటుడు తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో చిత్రం ‘మిరాయ్’ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ను లాక్ చేసుకుంది. జియో హాట్ స్టార్ లోకి అక్టోబర్ 10 న రాబోతుంది.
కూలీ ఫేమ్ కన్నా రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రేమ, మోసం, వంటి భావోద్వేగ అంశాలతో స్టోరీని చూపించారు.. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఓటీటీలోకి అక్టోబర్ 10 న రాబోతుంది.
వీటితో పాటుగా కురుక్షేత్ర నెట్ ఫ్లిక్స్ లోకి అక్టోబర్ లో రాబోతున్నాయి. సెర్చ్ ది నైనా మర్డర్ కేస్ జియో హాట్‌స్టార్ 10 న ఓటీటీలోకి రాబోతుంది. ఇంకా పలు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.. అలాగే వేరే భాషలోని వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఎక్కువగా మిరాయ్ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. థియేటర్లలో మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఓటీటీలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..